పోలింగ్ సిబ్బంది ర్యాండమైజేషన్
నిజామాబాద్‌అర్బన్: గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణలో భాగంగా పోలింగ్ సిబ్బంది మొదటి విడత ర్యాండమైజేషన్ ప్రక్రియను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వినయ్ కృష్ణా రెడ్డి సమక్షంలో శుక్రవారం నిర్వహించారు. కలెక్టరేట్‌లోని వీసీ హాల్‌లో ఎన్నికల సంఘం ని బంధనలను అనుసరిస్తూ ర్యాండమైజేషన్ చేపట్టారు. నిజామాబాద్, బోధన్, ఆర్మూర్ రెవె న్యూ డివిజన్లలోని మండలాల వారీగా ఆయా గ్రామ పంచాయతీల ఎన్నికల పోలింగ్ విధులు నిర్వర్తించే ప్రిసైడింగ్ అధికారులు, ఓపీవోలను ర్యాండమైజేషన్ ద్వారా కేటాయించారు. 545 గ్రామ పంచాయతీల సర్పంచ్, 5022 వార్డు స్థానాల ఎన్నికల నిర్వహణకు 20 శాతం రిజర్వ్ స్టాఫ్‌ను కలుపుకొని ప్రిసైడింగ్ అధికారులతోపాటు, ఓపీవోల ర్యాండమైజేషన్ నిర్వహించా రు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అంకిత్, డీ పీవో శ్రీనివాస్ రావు, నోడల్ అధికారి పవన్ కు మార్ తదితరులు పాల్గొన్నారు.


