నిజామాబాద్
న్యూస్‌రీల్
శనివారం శ్రీ 29 శ్రీ నవంబర్ శ్రీ 2025
ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతి ఒక్కరికీ పోటీ చేసి ప్రజాప్రతినిధిగా ఎన్నికయ్యే హక్కు ఉంది. కానీ, ఆ హక్కును కాలరాసే ప్రయత్నాలు చేస్తున్నాయి కొన్ని గ్రామాభివృద్ధి కమిటీలు. పంచాయతీ ఎన్నికలను శాసిస్తున్నాయి. సర్పంచ్, వార్డు మెంబర్ల పదవులకు వేలం నిర్వహిస్తూ ఎన్నికల నియమావళికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నాయి.
ఈ క్రమంలోనే బోధన్ డివిజన్ వర్ని మండలంలోని రెండు గ్రామాల్లో నామినేషన్ల తొలిరోజు వీడీసీలు తీర్మానించిన వారే సర్పంచ్ స్థానాలకు నామినేషన్లు చేశారు.ఈ స్థానాలు ఏకగ్రీవం కానున్నాయి.


