వరద బాధితులను ఆదుకోవడంలో విఫలం
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : వరద బాధితులను ఆ దుకోవడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఆరోపించారు. జాగృతి జనంబాట కార్యక్రమంలో భాగంగా గురు, శుక్రవారాల్లో కామారెడ్డి జిల్లాలో ఆ మె పర్యటించారు. శుక్రవారం కామారెడ్డిలో జ్యోతీబాపూలే వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి కవిత పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఆగస్టు చివ రి వారంలో కురిసిన భారీ వర్షాలతో జిల్లాలో 94 వే ల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని, రోడ్లు కొట్టుకుపోయాయని, పలువురు ప్రాణాలు కోల్పోయా రని పేర్కొన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి జిల్లాలో పర్యటించినా రైతులకు నయాపైసా పరిహారం ఇవ్వలేదన్నారు. కామారెడ్డిలో గత ఎన్నికల్లో ఇద్దరు ముఖ్యమంత్రులను ఓడగొట్టి జెయింట్ కిల్లర్ అనిపించుకున్న బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి ప్రభుత్వంపై పోరాడి నిధులు తీసుకురావడంలో విఫల మయ్యారని విమర్శించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కనీసం తమ పార్టీ ఎమ్మెల్యే ఉన్న నియోజకవర్గానికై నా నిధులు ఇవ్వకుండా అన్యాయం చేసిందన్నారు. కామారెడ్డికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు షబ్బీర్‌అలీ సీఎంపై ఒత్తిడి తీసుకువచ్చి నిధులు తేవాలని డిమాండ్ చేశారు.
ఒక్క బీసీకై నా టికెట్టిచ్చారా?
కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ ప్రకటించిందని, కానీ అదే ఎన్నికల్లో జిల్లాలో ఒక్క బీసీకి కూడా టికెట్టు ఇవ్వలేదని కవిత విమర్శించారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌పై జాగృతి రాష్ట్రవ్యాప్తంగా రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించడంతో ప్రభుత్వం రెండు బిల్లులు తీసుకువచ్చిందని, అయితే దాన్ని ఆమోదింపజేయడంలో విఫలమయ్యిందని దుయ్యబట్టారు. రిజర్వేషన్ల విషయంలో బీజేపీ మొదటి ద్రోహి అయితే కాంగ్రెస్ రెండో ద్రోహి అన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లించకుండా విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు 21, 22 ప్యాకేజీలకు ఇచ్చిన నిధులు కాంట్రాక్టర్ల జేబుల్లోకి వెళ్లాయే తప్ప పొలాలకు చుక్కనీరు పారలేదన్నారు. తనను కుటుంబం నుంచి దూరం చేసి కొందరు శునకానందం పొందుతున్నారన్నారు. లక్షలా ది మంది ప్రజలే కుటుంబంగా వారికి తనకు చేతనయిన సాయం చేస్తూ ముందుకు వెళుతున్నానని తెలిపారు. సమావేశంలో జాగృతి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నవీనాచారి, జిల్లా అధ్యక్షుడు సంపత్‌గౌడ్, ప్రతినిధులు వసంత, లత తదితరులు పాల్గొన్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు
అన్యాయంగా వ్యవహరిస్తున్నాయి
సీఎం వచ్చి వెళ్లినా నయాపైసా
ఇవ్వలేదు
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత


