అభివృద్ధి చూసి ఓర్వలేకే ప్రశాంత్ రెడ్డి విమర్శలు
● రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్‌రెడ్డి
కమ్మర్‌పల్లి: రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలు చూసి ఓర్వలేకే బా ల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి విమర్శలు చేస్తున్నా రని రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం భీమ్‌గల్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకే ప్రజ ల మద్దతు ఉంటుందని, తమ పార్టీకి ప్రజల్లో వస్తు న్న ఆదరణ చూసి ఏమి చేయాలో తెలియని పరిస్థితిలో ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి అబద్ధపు మాటలు మాట్లాడుతున్నాడని అన్నారు. బీఆర్‌ఎస్ హయాంలో మహిళలకు ఇచ్చిన రుణాలకు వడ్డీ మాఫీ చేయలేదన్నారు. సీఎం రేవంత్ రెడ్డి కోటి మంది మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇస్తుంటే కేవలం ఎన్నికల కోసమే ఇస్తున్నారని ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి తప్పుడు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. అధికారంలో లేక పోవడంతో హైదరాబాద్‌లో కేటీఆర్, బాల్కొండలో ప్రశాంత్‌రెడ్డి మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని ప్రజలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ఆయన కోరారు. భీమ్‌గల్ పట్టణ అధ్యక్షుడు జే నర్సయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి కుంట రమేశ్, నాయకులు గోపాల్ నాయక్, అన్వేష్, మహేశ్, రాజేశ్, నాగభూషణం, శ్యామ్‌రాజ్, నవీన్, అశోక్ పాల్గొన్నారు.


