పరీక్ష కేంద్రాల వద్ద 163 సెక్షన్ అమలు
నిజామాబాద్‌అర్బన్: జిల్లాలో డిసెంబర్ 1 నుంచి డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ మొదటి సంవత్సరం పరీక్షలు జరుగనుండగా, పరీక్ష కేంద్రాల వద్ద 163 సెక్షన్ అమలు చేస్తున్నట్లు సీపీ సాయిచైతన్య ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే పరీక్షల నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తలు చేపడుతున్నామన్నారు. డిసెంబర్ 6 వరకు పరీక్ష కేంద్రాల వద్ద నిబంధనలు కొనసాగుతాయన్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష కేంద్రాల వద్ద సబ్ డివిజన్లలో ఈ నిబంధనలు అమలు చేస్తామన్నారు. పదీక్ష కేంద్రాల వద్ద ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు ఉండకూడదన్నారు. నిషేధిత వస్తువులతో పరీక్ష కేంద్రాల వద్ద తిరగవద్దన్నారు. పరీక్ష కేంద్రాల పరిసరాల్లోని అన్ని జిరాక్స్ సెంటర్లను మూసిఉంచాలన్నారు.
నిజామాబాద్‌అర్బన్: జిల్లాలోని ఏఆర్, సివిల్ పోలీస్ సిబ్బందికి శుక్రవారం పోలీస్ కమిషనర్ సాయి చైతన్య తన కార్యాలయంలో ఉలెన్, బ్లాంకెట్స్ పంపిణీ చేశారు. చలికాలంలో విధుల నిర్వహణ కష్టమవుతున్న తరుణంలో ముందు జాగ్రత్తల్లో భాగంగా సిబ్బందికి బ్లాంకెట్స్ పంపిణీ చేసినట్లు ఆయన పేర్కొన్నారు. సిబ్బంది ఉలెన్ దుస్తులు ధరించాలన్నారు. విధి నిర్వహణలో కూడా ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలన్నారు. అదనపు డీసీపీ రాంచదర్‌రావు, రిజర్వు ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్, తిరుపతి పాల్గొన్నారు.


