చెట్టును ఢీకొన్న ట్రాక్టర్
బాల్కొండ:మెండోరా మండలం సావెల్ గ్రా మంలో శుక్రవారం ఇసుక ట్రాక్టర్ అతివేగంగా వెళ్లి చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటరలో ఎ వరికీ గాయాలు కాలేవు. మండలంలోని వె ల్కటూర్ పెద్ద వాగు నుంచి ఇసుకను శుక్రవారం అనుమతితో తరలిస్తున్నారు. కానీ ట్రాక్టర్‌ను డ్రైవర్లు వేగంగా నడుపుతూ ప్రమాదాలకు కారణమవుతున్నారు. గత నా లుగు రోజుల క్రితం ఇదే గ్రామంలో ఇసుక ట్రాక్టర్ అతి వేగంగా వచ్చి బోల్తా పడింది.
బోల్తాపడిన కారు
వేల్పూర్: మండలకేంద్రంలోని రహదారిపై ఓ కారు ప్రమాదవశాత్తు బోల్తాపడగా, ఒకరికి స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా.. మండలంలోని అమీనాపూర్ గ్రామానికి చెందిన లోలం శ్రీనివాస్ శుక్రవారం తన కారులో ఆర్మూర్ నుంచి స్వగ్రామానికి బయలుదేరాడు. వేల్పూర్ ఆర్‌అండ్‌బీ ప్రధాన రోడ్డుపై కారు అదుపుతప్పి బోల్తాకొట్టింది. ఈ ప్రమాదంలో కారు నడుపుతున్న శ్రీనివాస్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. అతడు ఇంతకుమందు కూడా రెండుసార్లు ఇదే రకమైన ప్రమాదాలతో బయటపడినట్లు గ్రామస్తులు తెలిపారు.
చెట్టును ఢీకొన్న ట్రాక్టర్


