ఖేలో ఇండియా పోటీల్లో ప్రతిభ
నవీపేట: మండలంలోని బినోలకు చెందిన స్విమ్మింగ్ క్రీడాకారిణి మిట్టపల్లి రిత్విక ఖేలో ఇండియా యూనివర్సిటీ స్విమ్మింగ్ పోటీల్లో ప్రతిభ కనబర్చింది. ఈనెల 25 నుంచి 28 వరకు రాజస్థాన్ రాజధాని జైపూర్‌లోని సవాయి యూనివర్సిటీ స్టేడియంలో జరిగిన జాతీయ స్థాయి పోటీల్లో ఒక బంగారు పతకంతోపాటు రెండు కాంస్య పతకాలను సాధించింది. కళింగ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రీయల్ టెక్నాలజీ యూనివర్సిటీ(భువనేశ్వర్) తరపున రిత్విక పాల్గొంది. ఈసందర్భంగా రిత్వికకు పీసీసీ చీఫ్ మహేష్‌కుమార్‌గౌడ్, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్తా, స్విమ్మింగ్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు చంద్రశేఖర్‌రెడ్డి, ఉమేష్, ఉపాధ్యక్షులు మహిపాల్‌రెడ్డి, జిల్లా ప్రతినిధులు అభినందనలు తెలిపినట్లు శుక్రవారం రిత్విక తండ్రి విలేకరులకు తెలిపారు.
తెయూ(డిచ్ పల్లి): తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో కొనసాగుతున్న డిగ్రీ రెగ్యులర్, బ్యాక్‌లాగ్ పరీక్షల్లో శుక్రవారం మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడుతూ ఇద్దరు విద్యార్థులు డిబార్ అయినట్లు ఆడిట్‌సెల్ డైరెక్టర్ ఘంటా చంద్రశేఖర్ తెలిపారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఏర్పాటుచేసిన 30 పరీక్ష కేంద్రాలలో మొత్తం 6,974 మంది అభ్యర్థులకు గాను 6,581 మంది విద్యార్థులు హాజరు కాగా 391 మంది గైర్హాజరు అయినట్లు తెలిపారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల పరీక్ష కేంద్రంలో ఇద్దరు విద్యార్థులు డిబార్ అయినట్లు తెలిపారు.
ఖలీల్‌వాడి: జిల్లా కేంద్రంలోని జీజీ కళాశాలలో శుక్రవారం అకడమిక్ ఆడిట్ విజయవంతంగా పూర్తయినట్లు కళాశాల ప్రిన్సిపాల్ డా.పి.రామ్మోహన్ రెడ్డి తెలిపారు. అకాడమిక్ అడ్వైజర్స్ బోధన్ ప్రిన్సిపాల్ సురేష్, వరప్రసాద్ కళాశాలలోని అన్ని శాఖలను, అనుబంధ విభాగాలను 2022–23, 2023–24 సంవత్సరాలకు సంబంధించిన అంశాలను క్షుణ్ణంగా పరిశీలించారన్నారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ రంగరత్నం, కో–ఆర్డినేటర్లు నహీద బేగం, వినయ్ కుమార్, రాజేష్ పాల్గొన్నారు.
నిజామాబాద్‌అర్బన్: జిల్లా కేంద్రంలోని బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో నేడు దీక్షా దివస్ కార్యక్రమం చేపట్టనున్నట్లు పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవన్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈసందర్భంగా అన్నదాన, రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నామన్నారు. ఆస్పత్రిలో పాలు, పండ్లు పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. అలాగే వేలాది మందితో దీక్షా దివస్‌ను నిర్వహిస్తున్నామన్నారు.
ఖేలో ఇండియా పోటీల్లో ప్రతిభ


