రాష్ట్రస్థాయి వాలీబాల్ టోర్నీ విజేత నిజామాబాద్
ధర్మారం(ధర్మపురి)/నిజామాబాద్‌నాగారం: పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నందిమేడారం తెలంగాణ బాలుర గురుకుల విద్యాలయంలో నిర్వహించిన అండర్–14 వాలీబాల్ ఎస్‌జీఎఫ్ రాష్ట్రస్థాయి క్రీడా పోటీలు శుక్రవారం రాత్రి ముగిశాయి. పోటీలకు 10 ఉమ్మడి జిల్లాల నుంచి 244 మంది బాలబాలకులు తరలివచ్చారు. మూడురోజుల పాటు జరిగిన పోటీల్లో ఫైనల్‌కు (బాలికల విభాగం) మహబూబ్‌నగర్, నిజామాబాద్ జట్లు చేరాయి. నిజామాబాద్ జట్టు మహబూబ్‌నగర్‌పై విజయం సాధించి, విజేతగా నిలిచింది. బాలుర విభాగంలో ఫైనల్స్‌లో ఖమ్మం జట్టు వరంగల్ జట్టుపై విజయం సాధించింది. లయన్స్‌క్లబ్ సౌజన్యంతో విజేతలకు ట్రోఫీలు ప్రదానం చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పెద్దపల్లి జిల్లా విద్యాధికారి శారద హాజరయ్యారు. అకడమీక్ అధికారి పీఎం షేక్, జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారి సురేశ్, మండల విద్యాధికారి ప్రభాకర్, మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ రాజ్‌కుమార్, వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. జిల్లా జట్టుకు పీడీలు మధు, నరేంధర్, కోచ్, మేనేజర్లుగా వ్యవహారించారు. నిజామాబాద్ జిల్లా జట్టును ఎస్‌జీఎఫ్ కార్యదర్శి నాగమణి ప్రత్యేకంగా అభినందించారు.


