వాహనాల తనిఖీ
సిరికొండ: మండలకేంద్రం సమీపంలో శుక్రవారం స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా ఫ్లయింగ్ స్క్వాడ్ బృందం వాహనాలను తనిఖీ చేశారు. వాహనాల్లో యాభై వేల కంటే ఎక్కువ డబ్బులు, మద్యం తరలిస్తున్నారా అని తనిఖీ చేశారు. ఉప తహసీల్దార్ గంగాధర్ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు.
● ఆధారాలు చూసి వాపస్ ఇచ్చిన అధికారులు
మాచారెడ్డి: గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో మండలంలోని ఘన్పూర్ (ఎం) స్టేజి వద్ద చెక్‌పోస్ట్ ఏర్పాటు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపూర్ గ్రామానికి చెందిన కూడెల్లి అశోక్ శుక్రవారం డీసీఎం వాహనంలో రూ.10 లక్షలతో హైదరాబాద్ వెళ్తున్నాడు. ఘనపూర్ స్టేజీ వద్ద తనిఖీ అధికారులు వాహనాన్ని ఆపి, చెకింగ్ చేయగా, రూ.10లక్షలు బయటపడ్డాయి. దీంతో వాహన యజమాని అల్లం లక్ష్మణ్ ఆధారాలు చూపించడంతో అధికారులు స్వాధీనం చేసుకున్న డబ్బును తిరిగి అతడికి ఇచ్చేశారు.
కామారెడ్డి అర్బన్: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (ఎస్‌జీఎఫ్) ఆధ్వర్యంలో శనివారం దోమకొండలోని ఆనంద్‌భవన్‌లో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా అండర్–14 బాలుర క్రికెట్ జట్టును ఎంపిక చేయనున్నారు. ఉదయం 11 గంటలకు ఎంపిక పోటీలు ఉంటాయని ఎస్‌జీఎఫ్ జిల్లా కార్యదర్శి హీరాలాల్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తిగలవారు తమ ఒరిజినల్ బోనఫైడ్ సర్టిఫికెట్‌తో రావాలని సూచించారు. ఎంపికై న జట్టు భద్రాద్రి కొత్తగూడెంలో నిర్వహించే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటుందని పేర్కొన్నారు.


