జిల్లా ఎన్నికల అధికారితో ఎలక్షన్ అబ్జర్వర్ భేటీ
నిజామాబాద్ అర్బన్: గ్రామ పంచాయతీ ఎన్నికల జనరల్ అబ్జర్వర్ జీవీవి శ్యాంప్రసాద్ లాల్ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డితో గురువారం కలెక్టరేట్‌లో భేటీ అయ్యారు. జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఏర్పాట్లను కలెక్టర్ వివరించారు. ఎన్నికలకు సంబంధించి ఫిర్యాదులు, సూచనలు చేయాలనుకునే వారు 63095 05554 నంబర్‌కు ఫోన్ చేయొచ్చని లేదా observergpe lec.nzb @gmail. com మెయిల్ చేయొ చ్చని అబ్జర్వర్ సూచించారు.
అందుబాటులోకి
టీ పోల్ మొబైల్ యాప్
నిజామాబాద్ అర్బన్: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ప్రజలు టీ–పోల్ మొబైల్ యాప్‌ను వినియోగించుకోవాలని కలెక్టర్ వినయ్‌కృష్ణారెడ్డి గురువారం ఒక ప్రకటనలో సూచించారు. పోలింగ్‌స్టేషన్, ఓటర్ స్లిప్ డౌన్‌లోడ్, ఫిర్యాదులకు సంబంధించిన వివరాలను పరిశీలించేందుకు యాప్ ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. యాప్‌ను ప్లే స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.
ఆకస్మిక తనిఖీలను
విస్తృతం చేయాలి
నిజామాబాద్ అర్బన్: గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఆకస్మిక తనిఖీలను వి స్తృతం చేయాలని, సోషల్ మీడియాపై ప్ర త్యేక నిఘా ఉంచాలని పోలీస్ కమిషనర్ సాయిచైతన్య పోలీసు అధికారులకు సూచించారు. జీపీ ఎన్నికల నేపథ్యంలో గురువారం ఆయన సెట్‌కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. ఎన్నికల్లో ఓటర్లను ప్రభావితం చేసేందుకు అక్రమంగా డబ్బులు, మద్యం రాకుండా అడ్డుకోవా లని సూచించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో ఫ్లాగ్‌మార్చ్‌ను నిర్వహించాలని, లాడ్జీలు, గెస్ట్‌హౌస్‌లు, కమ్యూనిటీ హళ్లను నిరంత రం తనిఖీ చేయాలని ఆదేశించారు. రాజకీయ కార్యకలాపాల్లో పోలీసు సిబ్బంది ప్రమేయం ఉండొద్దని, రౌడీషీటర్‌లను బైండోవర్ చేయాలని అన్నారు. అదనపు డీసీపీ బస్వారెడ్డి, స్పెషల్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.
పురుషుల భాగస్వామ్యంతోనే కుటుంబ నియంత్రణ
నిజామాబాద్‌నాగారం: ఆరోగ్యకరమైన, సంతోషకరమైన కుటుంబం పురుషులతోనే సాధ్యమని, అలాగే కుటుంబ నియంత్రణ సైతం వారి భాగస్వామ్యంతోనే కుటుంబ నియంత్రణ సాధ్యమని జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారిణి రాజశ్రీ అన్నారు. వ్యాసెక్ట మి అవగాహన, శస్త్రచికిత్సల పక్షోత్సవాల సందర్భంగా సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని వైద్యారోగ్యశాఖ కార్యాలయంలో గురువారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌వో మాట్లాడుతూ.. వ్యాసెక్టమి అవగాహన, శస్త్రచికిత్సల పక్షోత్సవాలను విజయవంతం చేయాలని, పీహెచ్‌సీల స్థాయిలో నిర్వహించే అవగాహన సదస్సుల్లో ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలు అవగాహన కల్పించాలన్నారు. వైద్యాధికారులు, వైద్యులు పాల్గొన్నారు.


