ఏసీబీ వలలో ఆర్మూర్ బల్దియా కమిషనర్
ఆర్మూర్ : ఇంటికి నంబర్‌ను అలాట్ చేసేందుకు డబ్బులు డిమాండ్ చేసిన ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్ అతిమల రాజు.. తన ప్రైవేట్ డ్రైవర్ ద్వారా రూ.20వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డా రు. మున్సిపల్ కమిషనర్ పట్టణంలోని యోగేశ్వర కాలనీలో ఒక్కడే అద్దె గదిలో ఉంటున్నారు. కమిషనర్ అద్దెకు ఉంటున్న ఇంటికి కొద్ది దూరంలో అదే కాలనీకి చెందిన గంగ రాజుల నర్సయ్య కొత్తగా ఇల్లు కట్టుకున్నాడు. ఇంటి నంబర్ కేటాయించడానికి కమిషనర్ రూ.50 వేలు డిమాండ్ చేయడంతో బాధితుడు నర్సయ్య ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. వారి సూచనల మేరకు రూ.20 వేలు లంచం ఇవ్వడానికి కమిషనర్‌ను బాధితుడు బతి మిలాడుకున్నాడు. గురువారం రూ.20 వేలను కమిషనర్ ఇంటికి వెళ్లి ఇవ్వగా, తన ప్రైవేట్ డ్రైవర్‌కు ఇవ్వాల్సిందిగా కమిషనర్ సూచించారు. బాధితుడి నుంచి డ్రైవర్ భూమేశ్వర్ లంచం డబ్బులు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. కమిషనర్‌తోపాటు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. డ్రైవర్ వద్ద ఉన్న బ్యాగ్‌లో నుంచి ఎలాంటి లెక్కలు లేని రూ.4 లక్షల 30 వేలు స్వాధీనం చేసుకున్నారు. కొంత మంది ఏసీబీ అధికారులు కమిషన్ ఇంటిని సోదా చేయగా, మరికొంత మంది మున్సిపల్ కార్యాలయంలో సోదాలు నిర్వ హించి పలు ఫైళ్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులిద్దరిపై కేసు నమోదు చేసి నాంపల్లి కోర్టులో హాజరుపర్చనున్నట్లు నిజామాబాద్ ఏసీబీ డీఎస్పీ శేఖర్‌గౌడ్ తెలిపారు.
తన ప్రైవేట్ డ్రైవర్ ద్వారా
రూ.20 వేలు తీసుకుంటూ..
ఆధారాలు చూపని మరో
రూ.4.30లక్షలు స్వాధీనం
మున్సిపల్ కార్యాలయంలో సోదాలు


