అష్టమి హడావుడి..
వర్ని: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బరిలో నిలుస్తున్న వారు మంచి ముహూర్తాలు చూసుకుంటున్నారు. గురువారం నామినేషన్‌ల ప్రక్రియ ప్రా రంభం కాగా తొలిరోజే నామినేషన్‌లు దాఖలు చేసేందుకు చాలా ముందుకు వచ్చారు. దీనికి కారణంగా శుక్రవారం అష్టమి కావడమే. అష్టమి రోజున నామినేషన్ వేయొద్దనే సెంటిమెంట్‌తో మండలంలోని జాకోర, శ్రీనగర్ నామినేషన్ స్వీకరణ కేంద్రాలకు గురువారమే చాలా మంది వచ్చారు. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు సాయంత్రం 5గంటల వరకే నామినేషన్‌లు స్వీ కరించాల్సి ఉండగా, ఆ సమయానికి ముందే కేంద్రానికి వచ్చిన వారి నుంచి అధికారులు సాయంత్రం 6.30గంటల వరకు నామినేషన్‌లు తీసుకున్నారు. నిర్ణీత సమయానికి ముందే వచ్చిన వారి నుంచి నామినేషన్‌లు స్వీకరించామని వర్ని ఎంపీడీవో వెంకటేశ్వర్ తెలిపారు.


