నోట్లు గుమ్మరిస్తేనే సర్పంచ్‌! | - | Sakshi
Sakshi News home page

నోట్లు గుమ్మరిస్తేనే సర్పంచ్‌!

Nov 28 2025 7:22 AM | Updated on Nov 28 2025 7:22 AM

నోట్ల

నోట్లు గుమ్మరిస్తేనే సర్పంచ్‌!

నామినేషన్‌ కేంద్రం తనిఖీ

ఏందిరాబై మీ ఊరి సర్పంచ్‌ పదవికి పోటీ బాగా ఉందంట గదా... అవు మల్లా ఏమనుకుంటున్నావు... పోటీలో ఎందరు ఉన్నా ఇద్దరి మధ్యనే ప్రధాన పోటీ, ఒక్కో అభ్యర్థి రూ.కోటి వరకూ ఖర్చు పెడతా అంటున్నాడు... అగో గిదేంది మరి అంత ఖర్చా... అవురా మరి సర్పంచ్‌ సీటు అంటే అంత క్రేజీ ఉంది. ఎవరైనా పోటీలో దిగాలంటే కనీసం రూ. కోటి జమ ఉంచుకోవాల్సిందే.. ఇది మేజర్‌ పంచాయతీలలో జరుగుతున్న చర్చ. – మోర్తాడ్‌(బాల్కొండ)

పంచాయతీ ఎన్నికలు ప్రారంభం కావడంతో గ్రామాల్లో ఎలక్షన్స్‌ హీట్‌ పెరిగింది. మండల కేంద్రాలు, మేజర్‌ గ్రామ పంచాయతీల్లో సర్పంచ్‌ పదవికి పోటీ చేసేవారు రూ. కోటి ఖర్చుకు కూడా వెనుకాడటం లేదు. గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌ను రాష్ట్ర ఎన్నికల సంఘం వెలువరించడంతో ఎక్కడ చూసినా ఖర్చుపైనే చర్చ సాగుతుంది. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఎన్నికల సంఘానికి నామమాత్రం లెక్క చూపుతున్నా, క్షేత్ర స్థాయిలో మాత్రం భారీగా సొమ్ము కుమ్మరించాల్సి వస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. మండల కేంద్రాలు, జాతీయ రహదారిని ఆనుకొన్ని ఉన్న గ్రామాలలో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం జోరుగా సాగుతుండటంతో అక్కడ సర్పంచ్‌ పదవిని పొందడానికి అభ్యర్థులు రూ. కోటి వరకూ సిద్ధం చేసుకుంటున్నారు. సర్పంచ్‌ స్థానం ఏ సామాజిక వర్గానికి రిజర్వు చేసినా ఖర్చు విషయంలో మాత్రం అభ్యర్థులు వెనుకంజ వేయకపోవడం చూస్తుంటే పదవిపై ఉన్న వ్యామోహం అంతా ఇంతా కాదని స్పష్టమవుతుంది. మోర్తాడ్‌, ముప్కాల్‌లలో సర్పంచ్‌కు పోటీ చేసే అభ్యర్థులు రూ. కోటి వరకూ ఖర్చు చేయాలని ఆలోచన చేస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. కమ్మర్‌పల్లి, మెండోరా, బాల్కొండ, వేల్పూర్‌, అంక్సాపూర్‌, లక్కోరా తదితర గ్రామాలలో పోటీ చేసే ఆశావాహులు రూ.25లక్షల నుంచి రూ.50లక్షల వరకూ ఖర్చు చేయాలనే ఆలోచనలో ఉన్నారని తెలుస్తోంది. చిన్నచితకా పంచాయతీల్లో ఆదాయం మాట ఎలా ఉన్నా పదవి పొందాలనే ఉద్దేశ్యంతో రూ.5లక్షల నుంచి రూ.10లక్షల వరకూ ఖర్చు చేయాలనే భావనలో అభ్యర్థులు ఉన్నారు. ఎన్నికల సంఘానికి అభ్యర్థులు చూపే ఖర్చు క్రమ పద్ధతిలోనే ఉంటుంది. క్షేత్ర స్థాయిలో మాత్రం అభ్యర్థుల ఖర్చు అంచనాలను మించిపోతుంది. సర్పంచ్‌ పదవికి ఫుల్‌ డిమాండ్‌ ఉండటం, ఎక్కడ చూసినా రియల్‌ ఎస్టేట్‌ ప్రభావం పెరిగిపోవడంతో పదవి కోసం అభ్యర్థులు అంచనాలను మించి ఖర్చు చేయాలని భావిస్తున్నారు. ఏదేమైనా సర్పంచ్‌ పదవిపై మోజుతో జేబులు ఖాళీ చేసుకోవడానికి ఎంతో మంది అభ్యర్థులు ముందుకు వస్తున్నారని చెప్పవచ్చు.

మీడియా సెంటర్‌ ప్రారంభం

నిజామాబాద్‌ అర్బన్‌: గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా కలెక్టరేట్‌లోని రూమ్‌ నెం.30లో ఏర్పాటు చేసిన మీడియా సెంటర్‌, మీడియా సర్టిఫికేషన్‌ అండ్‌ మానిటరింగ్‌ సెల్‌ (ఎంసీఎంసీ)ని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ వినయ్‌ కృష్ణారెడ్డి గురువారం ప్రారంభించారు. మీడియా కోసం అందుబాటులో ఉన్న సదుపాయాలు, ఎంసీఎంసీ విధుల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా కలె క్టర్‌ మాట్లాడుతూ... గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీడియా సెంటర్‌ ద్వారా ప్రింట్‌ అండ్‌ ఎలక్ట్రానిక్‌ మీడియాకు అందించాలని సూచించారు. ఎంసీఎంసీ ద్వారా చెల్లింపు వార్తలను గుర్తించడం, సకాలంలో ప్రచార ప్రకటనలకు సంబంధించిన అనుమతులు మంజూరు చేయాలని సూచించారు. పారదర్శకంగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించేందుకు మీడియా సహకరించాలని కోరారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ అంకిత్‌, డీపీవో శ్రీనివాస్‌ రావు, ఏఓ ప్రశాంత్‌ తదితరులు పాల్గొన్నారు.

రెండుచోట్ల ఏకగ్రీవ తీర్మానం

వర్ని: మండలంలోని రెండు గ్రామ పంచాయతీలో ఒకే వ్యక్తి నామినేషన్‌ వేయాలని గ్రామస్తులు గురువారం తీర్మానం చేశారు. సిద్దాపూర్‌ సర్పంచ్‌గా బాల్‌ సింగ్‌, చేలక తండా సర్పంచ్‌గా గంగారాం మాత్రమే నామినేషన్లు దాఖలు చేయాలని నిర్ణయించారు. తీర్మానానికి విరుద్ధంగా గ్రామస్తులెవరూ వ్యవహరించొద్దని పేర్కొన్నారు.

నిబంధనలు కచ్చితంగా పాటించాలి

అదనపు కలెక్టర్‌ అంకిత్‌

వర్ని: పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన నామినేషన్లలో నిబంధనలు కచ్చితంగా పాటించేలా చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్‌ అంకిత్‌ అధికారులకు సూచించారు. వర్ని మండలం సత్యనారాయణపురంలో నామినేషన్ల స్వీకరణను ఆయన గురువారం ఆకస్మికంగా పరిశీలించారు. నామినేషన్లు సమర్పించే వారికి నిబంధనలు తెలియజేసి స్వీకరించాలన్నారు. రిజర్వు చేయబడిన స్థానాల్లో కుల ధ్రువీకరణ పత్రం, నో డ్యూ సర్టిఫికెట్లు నామినేషన్‌తోపాటు తీసుకోవాలని సూచించారు. అన్ని రకాలుగా పరిశీలించిన తర్వాతనే నామినేషన్లు స్వీకరించాలని, ఎలాంటి తప్పులు, వివాదాలు తలెత్తకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని రిటర్నింగ్‌ అధికారి రత్నాకర్‌కు సూచించారు.

నవీపేట: మండలంలోని బినోలా గ్రామంలో ఏర్పాటు చేసిన నామినేషన్‌ స్వీకరణ కేంద్రాన్ని కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌ సాయి చైతన్య గురువారం ఆకస్మికంగా పరిశీలించారు. నామినేషన్‌ కేంద్రంలోని ఏర్పాట్లను ఎన్నికల సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్నందున నామినేషన్‌ కేంద్రం చుట్టూ 100 మీటర్ల పరిధిలో నిషేధాజ్ఞలు కొనసాగుతాయన్నారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా ప్రజలు సహకరించాలని కోరారు. ఆయన వెంట ఎస్సైలు తిరుపతి, యాదగిరి గౌడ్‌, ప్రిసైడింగ్‌ ఆఫీసర్‌ అనిత తదితరులు ఉన్నారు.

గంగారాం

బాల్‌సింగ్‌

పెద్ద గ్రామ పంచాయతీల్లో

రూ. కోటి దాటనున్న ఖర్చు

చిన్న గ్రామాల్లో రూ.20 లక్షల

వరకూ ఖర్చు అయ్యే అవకాశం

ఏ గ్రామంలోనైనా ఎన్నికల ఖర్చుపైనే చర్చ

నోట్లు గుమ్మరిస్తేనే సర్పంచ్‌! 1
1/5

నోట్లు గుమ్మరిస్తేనే సర్పంచ్‌!

నోట్లు గుమ్మరిస్తేనే సర్పంచ్‌! 2
2/5

నోట్లు గుమ్మరిస్తేనే సర్పంచ్‌!

నోట్లు గుమ్మరిస్తేనే సర్పంచ్‌! 3
3/5

నోట్లు గుమ్మరిస్తేనే సర్పంచ్‌!

నోట్లు గుమ్మరిస్తేనే సర్పంచ్‌! 4
4/5

నోట్లు గుమ్మరిస్తేనే సర్పంచ్‌!

నోట్లు గుమ్మరిస్తేనే సర్పంచ్‌! 5
5/5

నోట్లు గుమ్మరిస్తేనే సర్పంచ్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement