డిగ్రీ పరీక్షల్లో ఇద్దరు విద్యార్థులు డిబార్
తెయూ (డిచ్‌పల్లి): తెయూ పరిధిలో కొనసాగుతున్న డిగ్రీ సెమిస్టర్ రెగ్యులర్, బ్యాక్ లాగ్ పరీక్షల్లో గురువారం ఇద్దరు విద్యార్థులు డిబార్‌కు గురైనట్లు ఆడిట్ సెల్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఘంటా చంద్రశేఖర్ తెలిపారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 30 పరీక్ష కేంద్రాల్లో ఉదయం జరిగిన పరీక్షలకు 5,974 మంది విద్యార్థులకు 5,674 మంది హాజరుకాగా 299 మంది గైర్హాజరయ్యారని పేర్కొన్నారు. మధ్యాహ్నం జరిగిన పరీక్షలకు 5,589 మంది విద్యార్థులకు 5,117 మంది హాజరుకాగా 471 మంది పరీక్ష రాయలేదని తెలిపారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మంజీరా డిగ్రీ కాలేజీ పరీక్ష కేంద్రంలో ఒకరు, బోధన్ ప్రభుత్వ డిగ్రీ కాలేజీ పరీక్ష కేంద్రంలో ఒకరు మాల్‌ప్రాక్టీస్‌కు పాల్పడుతూ డిబార్ అయ్యారని పేర్కొన్నారు.
నిజామాబాద్ రూరల్: భగవద్గీత సకల సమస్యలకు పరిష్కారం చూపే సమాహారమని వక్తలు పేర్కొన్నారు. గీతా జయంతిని పురస్కరించుకొని అఖిల భారతీయ భగవద్గీత కేంద్ర ప్రచార మండలి ఆధ్వర్యంలో గురువారం పాఠశాల స్థాయి విద్యార్థులకు భగవద్గీత కంఠస్థ పఠన పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా గీతా భవనం ఉపాధ్యక్షుడు యొగ రామచంద్రం మాట్లాడుతూ విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందించేందుకు, దేశభక్తి, దైవభక్తిని పెంచడానికి జిల్లా స్థాయి భగవద్గీత పోటీలు నిర్వహించామన్నారు. ప్రతి ఒక్కరూ గీత శ్లోకాలు కంఠస్థం చేయాలని కోరారు. కార్యక్రమంలో బొడ్డు దయానంద్, చంద్రశేఖర శర్మ, పలు పాఠశాలల విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.
● డీఆర్డీవో సాయాగౌడ్
డిచ్‌పల్లి: బ్యాంకు లింకేజీ, సీ్త్రనిధి రుణాలను సద్వినియోగం చేసుకుంటూ మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలని డీఆర్డీవో సాయాగౌడ్ సూచించారు. గురువారం నిర్వహించిన డిచ్‌పల్లి మహిళా మండల సమాఖ్య సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. బ్యాంకు లింకేజీ రుణాలను వందశాతం రికవరీ చేయాలన్నారు. పాడి కొనుగోలు సెంటర్ల ద్వారా గ్రామ సంఘాల ఆదాయం పెంపొందించుకోవాలని సూచించారు. సమావేశంలో డీపీఎం సంధ్యారాణి, ఏబీఎన్ రవీందర్, సీసీలు, మండల సమాఖ్య అధ్యక్షురాలు స్వప్న, గ్రామ సంఘాల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.
డిగ్రీ పరీక్షల్లో ఇద్దరు విద్యార్థులు డిబార్


