మానవ మేధకు ఏఐ పరికరం మాత్రమే
తెయూ వీసీ టీ యాదగిరి రావు
నిజామాబాద్‌నాగారం:మానవ మేధకు ఏఐ సహా యం చేసే పరికరం మాత్రమేనని, విచక్షణతో వాడు కోవాలని తెలంగాణ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ యాదగిరి రావు తెలిపారు. నగరంలోని గిరిరాజ్ ప్ర భుత్వ కళాశాలలో గురువారం భౌతిక శాస్త్ర విభా గం ఆధ్వర్యంలో ‘కృత్రిమ మేధ యుగంలో విజ్ఞా న శాస్త్రాలకు ఉన్న అవకాశాలు–అవరోధాలు‘ అంశంపై జాతీయ సదస్సు నిర్వహించారు. సదస్సుకు ముఖ్య అతిథులుగా హాజరైన తెయూ వీసీ యాదగి రి రావు, కేయూ మాజీ వీసీ ఆర్.సాయన్న సావనీర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తక్కువ శ్రమతో ఎక్కువ సమాచారాన్ని వే గంగా,తక్కువ సమయంలో ఏఐ విశ్లేషిస్తుందన్నా రు. ప్రస్తుతం ఈ సేవలు ఖరీదైనవి, కానీ సమీప భ విష్యత్తులో తక్కువ ఖర్చుతో అందరికీ అందుబాటులోకి వస్తాయని అన్నారు. అనంతరం ఉస్మాని యా యూనివర్సిటీ సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొ ఫెసర్ కరుణాసాగర్ సదస్సుపై కీలక ఉపన్యాసం చేశారు. ముఖ్యవక్తలుగా ఐఐటీ హైదరాబాద్ సూ ర్యనారాయణ,ఎన్‌ఐటీ వరంగల్ ప్రొఫెసర్ శ్యామ్ తదితరులు పాల్గొన్నారు. సదస్సులో పాల్గొన్న ఆ చార్యులు, పరిశోధకులు,విద్యావేత్తలు, శాస్త్రవేత్తలు, ప రిశోధక విద్యార్థులు పత్ర సమర్పణలు చేశారు. కార్యక్రమంలో సదస్సు సమన్వయకర్తలు డాక్టర్ రామకష్ణ, భరత్ రాజ్, వైస్ ప్రిన్సిపాల్ డా.రంగరత్నం, ఐక్యూఏసీ కోఆర్డినేటర్ రాజేశ్, అకడమిక్ కోఆర్డినేటర్ నాహీద బేగం, పీఆర్వో దండుస్వామి, ఎన్‌సీసీ అధికారి లెఫ్టినెంట్ డాక్టర్ ఎం రామస్వా మి, ఏవో రామ్ కిషన్, సూపరింటెండెంట్ ఉదయభాస్కర్, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.


