శిశు మరణాల రేటు తగ్గించాలి
డీఎంహెచ్‌వో రాజశ్రీ
నిజామాబాద్‌నాగారం: పుట్టిన శిశువుల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని, శిశు మరణాల రేటు జీరో శాతానికి తీసుకువచ్చేందుకు కలిసికట్టుగా కృషి చేయాలని జిల్లా వైద్యాధికారి రాజశ్రీ సంబంధిత అధికారులను ఆదేశించారు. వైద్యారోగ్యశాఖ కార్యాలయంలో గురువారం వివిధ విభాగాలు, మెడికల్ ఎడ్యుకేషన్, వైద్య విధాన పరిషత్‌తో సంకల్ప సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌వో శిశువు పుట్టిన వెంటనే తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించాలన్నారు. సామాజిక ఆరోగ్య కేంద్రం, జిల్లా ఆస్పత్రి, ఎస్‌ఎన్‌సీయూ లాంటి కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని సూచించారు. పీడియాట్రిక్ ప్రొఫెసర్ డాక్టర్ శ్రీకాంత్ మాట్లాడుతూ చిన్నపిల్లల్లో శ్వాస కోశ వ్యాధులను ముందుగా గుర్తించి చికిత్స అందించాలన్నారు. అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేసినప్పుడే సంకల్పం నెరవేరుతుందన్నారు. సమావేశంలో జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్ శ్రీనివాస్ ప్రసాద్, నోడల్ ఆఫీసర్ డాక్టర్ రాజశేఖర్,న వైద్యులు శివ శంకర్, నిరూపరెడ్డి, శ్వేత, కావ్య, సామ్రాట్, శిఖర, వెంకటేశ్, పిల్లల వైద్య నిపుణులు, పీహెచ్‌సీల వైద్యాధికారులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.


