జీవితంపై విరక్తితో యువతి ఆత్మహత్య
బాల్కొండ: యువతి ఉరేసుకొ ని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మెండోరా మండలం వెల్కటూర్‌లో చోటు చేసుకుంది. ఎస్సై సుహాసిని తెలిపిన వివరాల ప్రకారం.. వెల్కటూర్‌కు చెందిన రెడ్డి అనూష(25) కొంతకాలంగా తలనొప్పి, చర్మ సంబంధిత వ్యాధులతో బాధపడుతోంది. ఈ క్రమంలో జీవితంపై విరక్తితో బుధవారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో దులానికి చున్నీతో ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. కుటుంబసభ్యుల ఫిర్యాదు తో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆర్మూర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
నిజామాబాద్ అర్బన్: జిల్లాలోని మద్యం సేవించి వాహనాలు నడిపిన 34 మందికి రూ.3 లక్షల 35 వేలు జరిమానా విధించినట్లు పోలీస్ కమిషనర్ సాయిచైతన్య తెలిపారు. నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్లలో తనిఖీలు నిర్వహించగా 34 మంది మద్యం తాగి వాహనాలు నడిపినట్లు గుర్తించామన్నారు. గురువారం కోర్టులో హాజరుపర్చగా జడ్జి జరిమానా విధించినట్లు తెలిపారు.
బాల్కొండ: మెండోరా మండలం వెల్కటూర్ శివారులో పెద్దవాగు నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న ఆరు ట్రాక్టర్లను ఎస్సై సుహాసిని గురువారం సీజ్ చేశారు. పెద్దవాగు నుంచి అనుమతులు, వే బిల్లులు లేకుండా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లను పట్టుకొని కేసు నమోదు చేశామన్నారు.
ఆర్మూర్‌టౌన్: పట్టణంలోని మామిడిపల్లి శివారులో పేకాట స్థావరంపై దాడి చేసి పేకాడుతున్న నలుగురిని పట్టుకున్నామని ఎస్‌హెచ్‌వో సత్యనారాయణ తెలిపారు. వారి నుంచి రూ. 11,500 నగదు స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసినట్లు ఆయన పేర్కొన్నారు.


