పేద విద్యార్థులు చదువుకు దూరమవుతున్నారు
● ఎస్‌ఎఫ్‌ఐ జాతీయ ఉపాధ్యక్షురాలు శిల్ప
నిజామాబాద్‌నాగారం: బీజేపీ పాలనలో పేద విద్యార్థులు చదువుకు దూరమవుతున్నారని ఎస్‌ఎఫ్‌ఐ జాతీయ ఉపాధ్యక్షురాలు శిల్ప అన్నారు. భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్‌ఎఫ్‌ఐ) రాష్ట్ర గర్ల్స్ స్థాయి అమ్మాయిల బహిరంగ సభ గురువారం నిర్వహించారు. అంతకుముందు నగరంలోని ప్రెస్‌క్లబ్ గ్రౌండ్ నుంచి బస్టాండ్ మీదుగా న్యూ అంబేడ్కర్ భవన్‌కు వరకు ర్యాలీ నిర్వహించారు. సభకు ముఖ్య అతిథిగా హాజరైన శిల్ప మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా విద్యారంగానికి నిధులు తగ్గించటంతో పేద విద్యార్థుల చదువుకు ఆటంకం కలుగుతోందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలుకు యత్నిస్తున్న నూతన జాతీయ విద్యా విధానంతో ఒరిగేది లేదని పేర్కొన్నారు. సమావేశంలో ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర గర్ల్స్ కన్వీనర్ పూజా, రాష్ట్ర కార్యదర్శి తాళ్ల నాగరాజు, రాష్ట్ర గర్ల్స్ కో కన్వీనర్లు మమత, దీపిక, రమ్య, కావ్య, సుమ, రాష్ట్ర ఉపాధ్యక్షులు కిరణ్, జిల్లా కార్యదర్శి విగ్నేశ్ పాల్గొన్నారు.


