రాజ్యాంగ విలువలను కాపాడాలి
● కలెక్టర్ వినయ్‌కృష్ణారెడ్డి
● కలెక్టరేట్‌లో అధికారులు,
సిబ్బందితో ప్రతిజ్ఞ
● ఘనంగా రాజ్యాంగ దినోత్సవం
నిజామాబాద్ అర్బన్: భారత రాజ్యాంగ విలువల ను కాపాడటానికి ప్రతిఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్ వినయ్‌కృష్ణారెడ్డి అన్నారు. నగరంలోని కలెక్టరేట్‌లో బుధవారం భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆయన అధికారులు, సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించారు. జాతి ఐక్యతను, అఖండతను కాపాడేందుకు అంకిత భావంతో కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, కలెక్టరేట్ ఏ.ఓ ప్రశాంత్, వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.
పోలీస్ శాఖ ఆధ్వర్యంలో..
జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా అదనపు డీసీపీ బస్వారె డ్డి, రామచంద్రరావు భారత రాజ్యాంగ ప్రవేశిక కా ర్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా వారు మా ట్లాడుతూ.. రాజ్యాంగ ప్రవేశిక గురించి క్షుణ్ణంగా వివరించి పోలీసు సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించా రు. రిజర్వు ఇన్‌స్పెక్టర్ తిరుపతి, సతీష్ ఉన్నారు.
ఏడో పోలీస్ బెటాలియన్‌లో..
డిచ్‌పల్లి: డిచ్‌పల్లిలోని రాష్ట్ర ప్రత్యేక పోలీస్ ఏడో బెటాలియన్‌లో రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా అడిషనల్ కమాండెంట్ సీహెచ్ సాంబశివరావు మాట్లాడుతూ.. భారత రాజ్యాంగం దేశానికి మార్గదర్శకత్వం వహించే ప్రామాణిక పత్రం అన్నారు. ప్రతి పోలీసు ప్రజల హక్కులను గౌరవిస్తూ రాజ్యంగ విలువలను కాపాడాలని పేర్కొన్నారు. అసిస్టెంట్ కమాండెంట్ కేపీ సత్యనారాయణ, రిజర్వు ఇన్‌స్పెక్టర్లు శ్రీనివాస్, మారుతి, త్రిముఖ్, నవనీత్, నారాయణ, చంద్రశేఖర్, ఆర్‌ఎస్‌ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.
తెయూలో..
తెయూ(డిచ్‌పల్లి): తెలంగాణ విశ్వవిద్యాలయం లా కళాశాలలో బుధవారం ఎన్‌ఎస్‌ఎస్ విభాగం ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఎన్‌ఎస్‌ఎస్ సమన్వయకర్త అపర్ణ మాట్లాడుతూ.. రాజ్యాంగం ప్రాధాన్యతను, విలువలను విస్తృతంగా ఎన్‌ఎస్‌ఎస్ వలంటీర్లు ప్రచారం చేయాలన్నారు. ప్రోగ్రాం ఆఫీసర్లు స్రవంతి, ఎండీ హలీంఖాన్, జెట్లింగ్ ఎల్లోసా పాల్గొన్నారు.
నిజామాబాద్ ప్రభుత్వ బాలికల కళాశాలలో..
నిజామాబాద్ నాగారం: నగరంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో భారత రాజ్యాంగ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా ఇంటర్ విద్యాశాఖ అధికారి తిరుమలపుడి రవికుమార్ పాల్గొని, మాట్లాడారు. ప్రజల అభ్యున్నతి, ప్రజాస్వామ్య పాలనతోనే సాధ్యమని, భారత రాజ్యాంగమే దీనికి మూలమని అన్నారు. అంతకుముందు అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అలంకరణ చేసిన అనంతరం విద్యార్థులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ప్రిన్సిపాల్ బుద్దిరాజ్, కళాశాల అ ధ్యా ప కులు బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.
రాజ్యాంగ విలువలను కాపాడాలి


