లింబాద్రి గుట్ట.. ఆధ్యాత్మిక స్ఫూర్తికి ప్రతీక: ఎమ్మెల్
కమ్మర్‌పల్లి: లింబాద్రి గుట్ట తెలంగాణ ఆధ్యాత్మిక స్ఫూర్తికి ప్రతీకగా నిలుస్తోందని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్తా అన్నారు. బుధవారం ఆయన భీమ్‌గల్‌లోని లింబాద్రి గుట్టపై నిర్వహించిన రథోత్సవం కార్యక్రమంలో పాల్గొన్నారు. గోవింద నామస్మరణతో భక్తులతో కలిసి రథంతో ముందుకు సాగారు. అనంతరం గర్భాలయంలో మూలవిరాట్‌ను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. దేశంలో సనాతన ధర్మం, హిందూ సంప్రదాయాలను ప్రజలు ఆచరిస్తున్నారని వెల్లడించారు. హిందువుల్లో ఐక్యత పెరగాలన్నారు. భక్తుల సౌకర్యార్థం ప్రభుత్వం సమగ్ర ఏర్పాట్లు చేయడం అభినందనీయన్నారు. ఎమ్మెల్యే వెంట బీజేపీ సీనియర్ నాయకులు పెద్దోళ్ల గంగారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి నాగోళ్ల లక్ష్మీనారాయణ, ఇల్లందుల ప్రభాకర్, మఠం పవన్, పవన్ ముందడ, సుగంధం హరీశ్, రేణికింది హరీశ్ తదితరులు ఉన్నారు.


