అర్జీలను సత్వరమే పరిష్కరించాలి
● అదనపు కలెక్టర్ అంకిత్
● ప్రజావాణికి 128 ఫిర్యాదులు
నిజామాబాద్‌అర్బన్: ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ అంకిత్ అధికారులకు సూచించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి 128 ఫిర్యాదులు వచ్చాయి. అదనపు కలెక్టర్‌తోపాటు డీఆర్డీవో సాయాగౌడ్, నిజామాబాద్ ఏసీపీ రాజావెంకట్ రెడ్డి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. కాగా, అర్జీలను పెండింగ్‌లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
కొన్ని నెలలుగా నాకు పెన్షన్ రావడం లేదు. అధికారుల చుట్టూ తి రుగుతున్నా పట్టించుకోవడం లేదు. నా భర్త నడవడానికి ఇబ్బందికరంగా ఉంది. గతంలోనూ ప్రజావాణిలో ఫిర్యాదు చేశా అంటూ బోధన్‌కు చెందిన శకుంతల తన భర్తతో కలిసి అధికారులకు ఫిర్యాదు చేసింది. బోరున విలపిస్తూ తమను ఆదుకోవాలని వేడుకున్నది. పరిశీలించిన అధికారులు సదరం సర్టిఫికెట్ గ డువు ముగిసిందని, రెన్యువల్ చేసిన తర్వాత పెన్షన్ పునరుద్ధరణ జరుగుతుందని చెప్పారు.
అర్జీలను సత్వరమే పరిష్కరించాలి


