ఐఎంఏకు రాష్ట్రస్థాయి పురస్కారాలు
నిజామాబాద్ నాగారం: ఇండియన్ మెడికల్ అసోసియేషన్ 9వ రాష్ట్ర మహాసభల్లో జిల్లా ఐఎంఏ రెండు అవార్డులను అందుకున్నది. కరీంనగర్‌లో ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో ఐఎంఏ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు డాక్టర్ అజ్జ శ్రీనివాస్, డాక్టర్ విక్రమ్‌రెడ్డి ఉత్తమ అధ్యక్ష విశిష్ట పురస్కారాన్ని మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ చేతుల మీదుగా అందుకున్నారు. ఐఎంఏ రాష్ట్ర మానసిక ఆరోగ్య అవగాహన కమిటీ కన్వీనర్, ప్రొఫెసర్ డా.విశాల్ ఆకుల ఉత్తమ మానసిక ఆరోగ్య విశిష్ట పురస్కారాన్ని అందుకున్నారు. కార్యక్రమంలో ఐఎంఏ నేషనల్ ఎథిక్స్ కమిటీ చైర్మన్ డాక్టర్ రవీంద్ర రెడ్డి, ఐఎంఏ నిజామాబాద్ ప్రతినిధులు, డాక్టర్లు కవితారెడ్డి, జీవన్‌రావు, అనుమల్ల సత్యనారాయణ, నీలి రాంచందర్, దామోదర్ రావు, కౌలయ్య, రమణేశ్వర్ పాల్గొన్నారు.


