కామారెడ్డిలో ఇరువర్గాల మధ్య ఘర్షణ | - | Sakshi
Sakshi News home page

కామారెడ్డిలో ఇరువర్గాల మధ్య ఘర్షణ

Oct 4 2025 8:04 AM | Updated on Oct 4 2025 8:04 AM

కామారెడ్డిలో ఇరువర్గాల మధ్య ఘర్షణ

కామారెడ్డిలో ఇరువర్గాల మధ్య ఘర్షణ

గాజు ముక్కతో దాడిలో

నలుగురికి తీవ్ర గాయాలు!

కత్తిపోట్లంటూ పట్టణంలో ప్రచారం

కామారెడ్డి క్రైం: జిల్లా కేంద్రంలో పండుగపూట జరిగిన ఇరు వర్గాల మధ్య ఘర్షణ కలకలం సృష్టించింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా.. పట్టణంలోని సుభాష్‌ రోడ్‌లో ఉన్న శాస్త్రి దుర్గామా త మండపం వద్ద నిత్యం వందల సంఖ్యలో జనం దాండియా కార్యక్రమంలో పాల్గొంటారు. దసరా రోజున గురువారం సైతం భారీ సంఖ్యలో ప్రజలు దాండియాలో పాల్గొన్నారు. ఈక్రమంలో అర్ధరాత్రి సమయంలో కేతన్‌ అనే యువకుడు, అతని స్నేహి తుడైన బృందన్‌తో కలిసి ఓ చోట మూత్రవిసర్జనకు చేస్తుండగా ప్రణయ్‌, వరుణ్‌, షణ్ముఖంలు వచ్చి దూరంగా వెళ్లాలని వారించారు. కేతన్‌ సమాచారం ఇవ్వడంతో అతని అన్న ప్రపుల్‌ అక్కడకు వచ్చాడు. వాగ్వాదం జరిగి ఇరు వర్గాల మధ్య గొడవకు దారి తీయగా, ఇరువర్గాలకు చెంది న చాలా మంది అక్కడ పోగ య్యారు. వారిలో నుంచి సి ద్ధార్థ్‌ అనే యువకుడు గాజు ముక్కను తీసుకుని ప్రపుల్‌, రాహుల్‌, మణికంఠ, మణిరాజులపై దాడి చేశాడు. వెంట నే సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చే రుకు ని ఇరువర్గాలను చెదరగొట్టా రు. గాయపడిన వారిని వెంటనే ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రికి తరలించారు. కేతన్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పట్టణ ఎస్‌హెచ్‌వో నరహరి తెలిపారు. కానీ పట్టణంలో మాత్రం కత్తిపోట్ల ఘటన జరిగిందని జోరుగా ప్రచారం జ రిగింది. నలుగురు వ్యక్తులు కత్తిపోట్లకు గురయ్యార ని స్థానికులు సైతం చెబుతున్నారు. పోలీసులు గాజుతో జరిగిన దాడి అని కేసు నమోదు చేయడంతో అనేక సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement