
క్రైం కార్నర్
లింగంపేట(ఎల్లారెడ్డి): మండలంలోని ఆయా గ్రామాల్లోని బెల్టు షాపులపై దాడి చేసినట్లు ఎస్సై దీపక్‌కుమార్ శుక్రవారం తెలిపారు. మండలంలోని ఎక్కపల్లితండా, పర్మళ్ల, నల్లమడుగు, సజ్జన్‌పల్లి తదితర గ్రామాల్లో బెల్టు షాపులు నిర్వహిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం రావడంతో దాడులు చేసినట్లు తెలిపారు. నిర్వాహకుల వద్ద ఉన్న మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. నిర్వాహకులపై కేసులు నమోదు చేశామన్నారు.
ధర్పల్లి: ఇంటి ఎదుట నిలిపిన బైకును గుర్తుతెలియని వ్యక్తులు దహనం చేసిన ఘటన ధర్పల్లి మండల కేంద్రంలో చోటుచేసుకుంది. వివరాలు ఇలా.. గ్రామానికి చెందిన శ్రీకాంత్ అనే వ్యక్తి గురువారం రాత్రి తన బైకును ఇంటి ఆవరణలో పార్క్ చేసి ఉంచాడు. గుర్తుతెలియని వ్యక్తులు తగలబెట్టడంతో బైకు పూర్తిగా కాలి బూడిదయ్యింది. మరుసటి రోజు ఉదయం బాధితుడు బైక్ కాలిపోయి ఉండటాన్ని చూసి, పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై కళ్యాణి తెలిపారు.
నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): మండలంలోని పోచారం ప్రాజెక్టు దిగువన ఉన్న పెద్దవాగులో చేపల వేటకు వెళ్లిన ఓ వ్యక్తి నీటిలో మునిగి గల్లంతయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా.. రాజంపేట మండలం సిద్ధాపూర్‌కు చెందిన మచ్చంటి శేఖర్(32)అనే వ్యక్తి తన ఏడేళ్ల కుమారుడు అనిల్‌తో కలిసి గురువారం చేపలు పట్టేందుకు పోచారం ప్రాజెక్టు దిగువన ఉన్న పెద్దవాగు వద్దకు వచ్చాడు. చేపలు పట్టేక్రమంలో కొడుకు అనిల్ కళ్లేదుటే నీటిలోకి దిగిన శేఖర్ ప్రమాదవశాత్తు మునిగిపోయాడు. కాగా శేఖర్ మృతదేహం కోసం నాగిరెడ్డిపేట ఎస్సై భార్గవ్‌గౌడ్ ఆధ్వర్యంలో ఎల్లారెడ్డి ఫైర్‌స్టేషన్ సిబ్బంది సహాకారంతో గాలింపు చర్యలు చేపట్టారు. శుక్రవారం రాత్రి వరకు కూడ అతని మృతదేహం లభ్యమవలేదు.

క్రైం కార్నర్