
కాలేయం జాగ్రత్త
న్యూస్‌రీల్
నిజామాబాద్
● అవగాహన, జాగ్రత్తలు
అత్యవసరం
● నేడు ప్రైవేట్ వైద్యులు,
అధికారులతో వైద్యారోగ్యశాఖ
ప్రత్యేక సమావేశం
సోమవారం శ్రీ 22 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2025
కదిలొచ్చిన అమ్మ..
సుభాష్‌నగర్: దుర్గాదేవి శరన్నవరాత్రులు సోమవారం నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో నగరంలోని ఇంద్రప్రియదర్శిని కాలనీ వాసులు దుర్గామాత ఆగమనం కా ర్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. ము ఖ్యఅతిథిగా అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూ ర్యనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా ప్రజలందరూ కలిసిమెలసి నవరాత్రులు జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోందన్నారు. జీఎ స్టీని తగ్గించి నరేంద్రమోదీ దేశ ప్రజలకు దసరా, దీపావళి బహుమతి అందజేశారన్నారు. మాజీ కార్పొరేటర్ నిచ్చెంగ్ లతాకృష్ణ, ఆనంద్, పవన్ పాల్గొన్నారు.
జాతీయ స్థాయి
పోటీలకు ఎంపిక
కమ్మర్‌పల్లి: మండల కేంద్రంలోని మిసిమి హైస్కూల్‌లో తొమ్మిదో తరగతి చదువుతు న్న డి అక్షిత్, ఎల్ రేవంత్ జాతీయ స్థాయి చౌక్ బాల్ పోటీలకు ఎంపికై నట్లు పాఠశాల కరెస్పాండెంట్ బాలి రవీందర్ తెలిపారు. రాష్ట్రస్థాయి పోటీల్లో వీరు జిల్లా జట్టు తరఫున పాల్గొని ఉత్తమ ప్రతిభ కనబర్చార న్నారు. ఈనెల 25 నుంచి 28 వరకు విశాఖపట్టణంలో నిర్వహించే జాతీయ స్థాయి పోటీల్లో రాష్ట్ర జట్టు తరఫున పాల్గొంటార న్నారు. ఆదివారం విద్యార్థులతోపాటు, పీఈటీ సంజీవ్‌ను సన్మానించారు.
నేటి నుంచి టీపీటీఎఫ్ అధ్యయన తరగతులు
కామారెడ్డి టౌన్ : జిల్లాలో ఈనెల 22, 23వ తేదీలలో తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫె డరేషన్(టీపీటీఎఫ్) రాష్ట్ర స్థాయి అధ్యయన తరగతులు నిర్వహించనున్నట్లు సమాఖ్య జిల్లా అధ్యక్షుడు లింగం ఒక ప్రకటనలో తెలిపారు. పాత రాజంపేట్ రైల్వే గేట్ వద్దనున్న లేపాక్షి హోమ్స్ కమ్యూనిటీ హాల్‌లో తరగతులు ఉంటాయని పేర్కొన్నారు. సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు అనిల్‌కుమార్‌తో పాటు రాష్ట్ర, జిల్లా నేతలు పాల్గొంటారని తెలిపారు
చాపకింద నీరులా విస్తరిస్తున్న హెపటైటీస్ బీ, సీ
శరీరంలో ప్రధానమైన కాలేయం పనితీరును హెపటైటీస్ దెబ్బకొడుతోంది. చాపకింద నీరులా విస్తరిస్తున్న వైరస్ ప్రాణాల మీదికి వచ్చేంత వరకు బయటపడడం లేదు. హెపటైటీస్ బీ, సీ బాధితుల సంఖ్య జిల్లాలో పెరుగుతోంది. వైరస్‌పై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించడంతోపాటు అప్రమత్తం చేసేందుకు వైద్యారోగ్యశాఖ చర్యలు తీసుకుంటోంది. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులకు వచ్చే ప్రతి రోగికి స్క్రీనింగ్ చేసేందుకు సిద్ధమైంది. ఈ మేరకు సోమవారం జిల్లాలోని ప్రైవేట్ వైద్యులు, వైద్యారోగ్యశాఖ అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించనుంది.
నిజామాబాద్‌నాగారం: జిల్లాలో హెపటైటీస్ చాపకింద నీరులా విస్తరిస్తోంది! ఏ, బి, సీ, డీ, ఈ ఐదు రకాల వైరస్‌లలో బీ, సీ రకాలు ప్రమాదకరం. హె పటైటీస్ బీ ని టీకాల ద్వారా నయం చేసే అవకాశం ఉన్నప్పటికీ ‘సీ’ బారిన పడిన వారు కోలుకోవడం కష్టమే. హెపటైటీస్ ఏ, డీ, ఈ అనే వైరస్ కేవలం కలుషితమైన ఆహారం, నీరు కారణంగా వస్తుంది. చాలా మంది ఈ మూడు వైరస్‌ల బారిన పడుతున్నప్పటికీ కోలుకుంటున్నారని వైద్యులు చెబుతున్నారు.
హెపటైటీస్ ‘బీ’కి అందుబాటులో టీకాలు
స్క్రీనింగ్ ద్వారా హెపటైటీస్ బీ బారిన పడింది లేనిదీ తెలుసుకోవచ్చు. హెపటైటీస్ చాపకింద నీరులా విస్తరిస్తున్న నేపథ్యంలో అప్రమత్తమైన వైద్యారోగ్యశాఖ.. హై రిస్క్‌లో వైద్య సేవలందించే స్టాఫ్ నర్సులకు ఇప్పటికే టీకాలు ఇచ్చింది. ఈ టీకాలు మూడు దఫాలుగా తీసుకోవాల్సి ఉంటుంది. మొదటి టీకా తీసుకున్న నెల రోజులకు మరో డోసు, మళ్లీ 6 నెలలకు చివరి డోసు తీసుకోవాల్సి ఉంటుంది. జీజీహెచ్‌లో విధులు నిర్వర్తిస్తున్న 200 మందికిపైగా స్టాఫ్ నర్సులకు హెపటైటీస్ బి రాకుండా ఉండేందుకు వారం రోజులక్రితం మొదటి డోసు టీకాలు ఇచ్చారు.
త్వరలో జీజీహెచ్‌లో ప్రత్యేక వార్డు
హెపటైటీస్ బీ, సీ బాధితులకు చికిత్స అందించేందుకు జీజీహెచ్‌లో ప్రత్యేక వార్డు ఏర్పాటు చేయాలని వైద్యఽశాఖాధికారులు ఇప్పటికే ప్రణాళికలు రచిస్తున్నారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రభుత్వజనరల్ ఆస్పత్రి(జీజీహెచ్‌లో) వార్డు కేటాయించనున్నారు. ఈ మేరకు సోమవారం ప్రత్యేకంగా జీజీహెచ్ సూపరింటెండెంట్, ప్రైవేట్ ఆస్పత్రుల వైద్యులతో జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారులు సమావేశం కానున్నారు.
అవగాహన కల్పించేందుకు చర్యలు
హెపటైటీస్ ఏ, బీ, సీ, డీ, ఈ అనే వైరస్‌పై జి ల్లాలోని ప్రజలకు అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. జిల్లాలోని ప్రతి పీహెచ్‌సీ పరిధిలో గ్రా మాల్లోని ప్రజలకు హెపటైటీస్‌పై అవగాహన కల్పిస్తాం. మా సిబ్బందికి ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చి మరీ చైతన్యం చేయడానికి ప్రయత్నిస్తున్నాం.
– తుకారాం రాథోడ్, జిల్లా నోడల్ అధికారి
జిల్లాలో బాధితులు..
జిల్లాలో హెపటైటీస్ బీ బారినన పడిన వారు 140 మంది, హెపటైటీస్ సీ బారిన పడిన వారు 60 మందికిపైగా ఉన్నారు. బీ, సీ రకాల వైరస్‌లు అత్యంత ప్రమాదకరమైనవి. రెండు రకాల వైరస్‌లు వివిధ రకాలుగా వ్యాపిస్తాయి. ట్రాన్స్‌జెండర్లు, డ్రగ్స్ తీసుకునేవారు, సెక్స్ వర్కర్లు ఎక్కువగా బాధితులుగా ఉంటారు. అలాగే తల్లికి ఉంటే పుట్టబోయే బిడ్డకు, సెలూన్‌లలో బ్లేడ్‌లతో, సింగిల్ యూజ్ సిరింజీలు, రక్తాన్ని పరీక్షించే సూదుల కారణంగా, టాటూ వేయించుకునే వారికి, డయాలాసిస్ రోగులకు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. సీ్త్ర, పురుష బేధం లేకుండా ఒకరికి ఉంటే సెక్స్ ద్వారా మరొకరికి వ్యాపిస్తుంది. రక్షణ లేని లైంగిక సంపర్కంతో వైరస్ ముప్పు ఉంటుంది.
హెపటైటీస్ సీ బారినపడిన వారు ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాల్సిందేనంటున్నారు వైద్యాధికారులు. కాలేయ వాపు, మచ్చలు, చివరకు కాలేయ క్యాన్సర్‌కు దారి తీస్తుందంటున్నారు. ‘సీ’ వైరస్ సోకడా నికి ప్రధాన కారణంగా అప్పటికే వైరస్ సోకిన వారితో లైంగిక సంబంధాలు, అనారోగ్యకర సూదుల వినియోగం, రక్తమార్పిడి, సురక్షితం కాని శృంగారం కారణమవుతుంది.

కాలేయం జాగ్రత్త

కాలేయం జాగ్రత్త

కాలేయం జాగ్రత్త