
చూడు.. ఒక వైపే
● సాంకేతిక పరిజ్ఞానానికి రెండు కోణాలు
● మనం ఎలా ఉపయోగిస్తే
అలాంటి ఫలితాలు
● బీటెక్ పూర్తి చేసిన నిజామాబాద్ నగరానికి చెందిన ఓ యువకుడు చేతిలోని ఫోన్‌ను వాడుతూ ఆన్‌లైన్ బెట్టింగ్‌కు ఆలవాటు పడ్డాడు. అప్పులపాలై రైలు కింద పడి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించి గాయాలతో బయటపడ్డాడు.
● స్మార్ట్ ఫోన్‌లో క్లాసులు విని నిజామాబాద్ నగరంలోని నామ్‌దేవ్‌వాడకు చెందిన ఓ విద్యార్థిని రెండేళ్ల క్రితం నీట్ ర్యాంక్ సాధించింది. ప్రస్తుతం ఎంబీబీఎస్ చదువుతోంది.
ఖలీల్‌వాడి: మానవ మనుగడ, అభివృద్ధిలో సాంకేతిక పరిజ్ఞానం(టెక్నాలజీ) పాత్ర కీలకంగా మారింది. మనం ఉన్నచోటి నుంచి సప్తసముద్రాల అవతల ఉన్న వ్యక్తి ఏం చేస్తున్నాడో.. ఎటు వెళ్తున్నాడో నేరు గా చూడగలుగుతున్నాం. ఏఐ టెక్నాలజీలో మనిషి అవసరం లేకుండా పని చేసే పరిస్థితి వచ్చింది. ఆన్‌లైన్‌లో సబ్జెక్ట్ నేర్చుకుంటూ ఉన్నత విద్యను అందిపుచ్చుకుంటున్నారు. ఇదంతా నాణేనికి ఒక వైపు. మన అరచేతిలో ఉన్న సాంకేతిక పరిజ్ఞానం అనే నాణేనికి మరో వైపు చూసే వారి జీవితాలు చిన్నాభిన్నమవుతున్నాయి. బంగారు భవిష్యత్ నాశనమవుతోంది. అందుకే సాంకేతిక పరిజ్ఞానాన్ని ‘చూడు.. ఒ క వైపే’ అనే పరిస్థితి ఉంది. మనం ఏది చేస్తే అదే.. ఏది కోరుకుంటే అదే.. సాంకేతికతకు ఒకవైపే ఉందామా. రెండో వైపునకు వెళ్లి దారి తప్పుదామా అంతా మన చేతుల్లోనే ఉంది.
మంచికి ఉపయోగిస్తే మంచి ఫలితాలు
నేడు ఏ రంగంలో రాణించాలన్నా సాంకేతికతను ఉపయోగించాల్సిందే. ఏ సమాచారం కావాలన్నా మనకు ఇంటర్నెట్‌లో పుష్కలంగా లభిస్తుంది. పా ఠ్యాంశాలు, విశ్లేషణలు, గణిత సమస్యల పరిష్కారం, కళలు, చిత్రాలు ఇలా ఏదిపడితే అది మన ముందుకు వస్తుంది. వీటిని విద్యార్థులు ఉపయోగించుకోవచ్చు. ఏ అంశంౖపైనెనా నిపుణుల సలహాలు, సూచనలు లభిస్తాయి. అలాగే వ్యాపారంలో మెలకువలు, వ్యాపారం ఎలా చేసుకోవాలి, ఎలా ముందకు వెళ్లాలి అనే అంశాలూ ఉంటాయి. దీంతోపాటు వ్యవసాయం, చదువు, ఉద్యోగం, ఏదైనా ఉపాధి రంగాల్లో మనకు అవసరమైన పూర్తి సమాచారం అందుబాటులో ఉంటుంది. జిల్లాకు చెందిన పలువురు విద్యార్థులు సాంకేతికత సహాయంతో ప్రాజెక్టులను తయారు చేసి జాతీయ స్థాయిలో ప్రతిభ చాటారు. కేసుల దర్యా ప్తు, చోరీల నివారణకు పోలీసులు సాంకేతికను వినియోగించుకుంటున్నారు. పోలీసులు లోకేషన్ ట్రాక్ చేసి నిందితులను అరెస్ట్ చేసిన ఘటనలూ ఉన్నాయి.
చెడుకు ఉపయోగించొద్దు
సాంకేతికతను చెడుకు ఉపయోగిస్తే కష్టాలు తప్ప వు. ప్రస్తుతం ఎంతో సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉంది. దీనిని మంచికి ఉపయోగించుకుంటే అనేక ప్రయోజనాలుంటాయి. చాలా మంది నేరాల కు, అసాంఘిక కార్యక్రమాలకు అడ్డ దారిలో డబ్బు సంపాదించడానికి ఉపయోగిస్తున్నారు. చెడుకు ఉపయోగిస్తే చట్టం తనపని తాను చేస్తుంది.
– వెంకటేశ్వర్‌రావు, ఏసీపీ, సైబర్ క్రైం, నిజామాబాద్