
దుర్గమ్మ పూజకు వేళాయే..
భక్తిశ్రద్ధలతో కొలుస్తున్నాం
ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు..
● నేటి నుంచి దేవీ శరన్నవరాత్రి
ఉత్సవాలు
● జిల్లావ్యాప్తంగా సిద్ధమైన మండపాలు
నిజామాబాద్ రూరల్: అమ్మలగన్న అమ్మ దుర్గమ్మ శరన్నవరాత్రి ఉత్సవాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈనేపథ్యంలో జిల్లావ్యాప్తంగా అన్ని మండలాలు, గ్రామాల్లో వివిధ సంఘాల ఆధ్వర్యంలో దేవి మండపాలను అందంగా ఏర్పాటు చేశారు. ఈ ఉత్సవాల్లో పదకొండు రోజులపాటు అమ్మవారు పదకొండు రూపాల్లో భక్తులకు దర్శనమిస్తారు. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి ఆశ్వయుజ శుద్ధ దశమి వరకు ఒక్కో రోజు ఒక్కో రూపంలో అమ్మవారిని భక్తులు పూజించి, నైవేధ్యాలు సమర్పిస్తారు. అలాగే మండపాల నిర్వాహకులు సైతం అమ్మవారి దీక్ష చేపట్టి, 11 రోజులు నిష్ఠతో పూజలు నిర్వహిస్తారు.
గత 19 సంవత్సరాల నుంచి అమ్మవారిని భక్తిశ్రద్ధలతో కొలుస్తున్నాం. కోరిన కోరికలు తీరస్తు అమ్మవారు ప్రతి ఏటా గాజులపేటలో కొలువుదీరుతుంది. పదకొండు రోజుల పాటు అమ్మవారికి కుంకుమార్చనలు, ప్రత్యేక పూజలు భక్తులు నిర్వహిస్తాం.
–ఔదాగిరి సుధీర్, గాజులపేట
దేవిశరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా దుర్గామాత పదకొండు రోజుల పాటు వివిధ రూపాల్లో భక్తులకు దర్శనమివ్వనుంది. ప్రతిరోజు భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి, నైవేద్యాలు సమర్పించనున్నారు. అలాగే మండపాల్లో అన్నదానాలు, ఆధ్మాత్మిక కార్యక్రమాలు, నిర్వహిస్తారు. –సురేష్, గాజులపేట

దుర్గమ్మ పూజకు వేళాయే..

దుర్గమ్మ పూజకు వేళాయే..

దుర్గమ్మ పూజకు వేళాయే..