
రేషన్ బియ్యం పట్టివేత
ఆర్మూర్ టౌన్: మండలంలోని అంకాపూర్ గ్రామపంచాయతీ సమీపంలో ఆదివారం విజిలెన్స్ అధికారులు, ఆర్మూర్ పోలీసులు సంయుక్తంగా కలిసి రేషన్ బియ్యంను పట్టుకున్నట్లు ఎస్‌హెచ్‌వో సత్యనారాయణ గౌడ్ తెలిపారు. లారీలో 250 బస్తాల్లో ఉన్న బియ్యంను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. బియ్యంను తరలిస్తున్న అంజి, మహేందర్, రాజయ్య, నరేష్‌పై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
ఇసుక ట్రాక్టర్ల పట్టివేత
వేల్పూర్: మండలంలోని రామన్నపేట్‌లో అక్రమంగా తరలిస్తున్న రెండు ఇసుక ట్రాక్టర్లను శనివారం అర్ధరాత్రి గ్రామస్తులు పట్టుకొని మోర్తాడ్ పోలీసులకు అప్పగించారు. గ్రామస్తు లు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామంలోని వాగు నుంచి కొందరు వ్యక్తులు రాత్రిపూట ఇసుకను అక్రమంగా రవాణాకు పాల్పడుతున్నారని గుర్తించి నిఘా పెట్టామన్నారు. గ్రామం నుంచి జాగిర్యాల్ రోడ్డు వైపు ఇసుకను తీసుకెళ్తున్న ట్రాక్టర్లను గుర్తించి పట్టుకున్నామన్నారు. వెంటనే మోర్తాడ్ పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు వచ్చి ట్రాక్టర్లను పోలీస్‌స్టేషన్‌కు తరలించారని పేర్కొన్నారు.