
పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
మోపాల్/ఖలీల్‌వాడీ: నగరశివారులోని బోర్గాం(పి) జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల 1991–92 బ్యా చ్ విద్యార్థులు, గురువులు ఆదివారం కిసాన్ ము న్నూరు కాపు కల్యాణ మండపంలో ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. 33 ఏళ్ల తర్వాత విద్యార్థులందరూ ఒకే వేదికపై కలుసుకోవడంతో ఒకరినొకరు ఆలింగనం చేసుకుంటూ అనాటి జ్ఞాపకాలను గుర్తుకుతెచ్చుకున్నారు. నాడు చదువు నే ర్పిన ఉపాధ్యాయులను సమ్మేళనానికి ఆహ్వానించి, సన్మానించారు. పూర్వ విద్యార్థి, సినీ రచయిత బండోజి సతీష్ తన వ్యాఖ్యానంతో ఆకట్టుకుంటూ గు రుశిస్యుల ఆత్మీయ సమ్మేళనాన్ని ఆహ్లాదపరిచాడు. అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటపాటలతో ఉల్లాసంగా గడిపారు.
యోగా గురువుకు సన్మానం
రుద్రూర్: మండల కేంద్రానికి చెందిన యోగా గురువు డాక్టర్ విశ్వనాథ్ మహాజన్‌ను కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి ఆదివారం సన్మానించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా విశేష సేవలందించిన వారిని సికింద్రాబాద్‌లో ఘనంగా సత్కరించారు. ఇటీవల యోగా ఆంధ్రాలో భాగంగా రాయలసీమ విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన సెమినార్‌కు విశ్వనాథ్ మహాజన్ హాజరై యోగా ప్రాధాన్యతను వివరించారు. కార్యక్రమంలో భారత స్వాభిమాన్ ట్రస్ట్ పతంజలి రాష్ట్ర అధ్యక్షుడు శ్రీధర్‌రావ్ పాల్గొన్నారు.

పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం