
బిల్లులు సకాలంలో చెల్లించాలి
● అధికారులకు కలెక్టర్
వినయ్ కృష్ణారెడ్డి ఆదేశం
● సిరన్‌పల్లిలో ఇందిరమ్మ ఇళ్ల
నిర్మాణాల పరిశీలన
నవీపేట: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ బిల్లులను సకాలంలో చెల్లించాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి అధికారులను ఆదేశించారు. నవీపేట మండలంలోని సిరన్‌పల్లి గ్రామంలో గురువారం ఆయన పర్యటించి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పరిశీలించారు. లబ్ధిదారులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. గ్రామంలో 93 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కాగా 69 గ్రౌండింగ్ అయ్యాయని, 12 ఇళ్లు స్లాబ్ దశకు చేరుకున్నాయన్నారు. ఇంకా 24 మంది లబ్ధిదారులతో మాట్లాడి వెంటనే నిర్మాణాలను ప్రారంభించాలని సూచించారు.
ప్రభుత్వ కార్యాలయాల తనిఖీ
నవీపేటలోని ఎంపీడీవో, తహసీల్ కార్యాలయాల ను కలెక్టర్ తనిఖీ చేశారు. గ్రామాలలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల వేగాన్ని పెంచేందుకు అధికారులు కృషి చేయాలన్నారు. పెండింగ్‌లో ఉన్న భూభారతి అర్జీలను పరిశీలించాలన్నారు. అదనపు కలెక్టర్ కిరణ్‌కుమార్, హౌసింగ్ పీడీ పవన్‌కుమార్, ఎంపీడీవో నాగనాథ్, తహసీల్దార్ వెంకట రమణ ఉన్నారు.