
యువకుడి అదృశ్యం
ఖలీల్‌వాడి: నగరంలోని వినాయక్ నగర్‌కు చెందిన కాంపెల్లి రాము అదృశ్యం అయినట్లు నాలుగో టౌన్ ఎస్సై శ్రీకాంత్ గురువారం తెలిపారు. వినాయక్ నగర్‌లోని అంగిటి హోటల్ వద్ద రాము అదృశ్యమయ్యాడని, అతడి మానసిక స్థితి బాగాలేదని సోదరుడు తిరుపతి పేర్కొన్నాడు. తిరుపతి ఫిర్యాదు మేరకు కేసు, నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. ఎవరికై నా రాము ఆచూకీ తెలిస్తే 8712659840, 8712659836కు సమాచారం అందించాలని ఎస్సై తెలిపారు.
అక్రమ మద్యం స్వాధీనం
మోర్తాడ్: భీమ్‌గల్ మండలం బాబాపూర్‌లో అక్రమంగా మద్యం విక్రయిస్తున్న ఇద్దరిని అరెస్టు చేసినట్లు ఎకై ్సజ్ ఎస్సై గోవర్ధన్ గురువారం తెలిపారు. బాబాపూర్‌కు చెందిన జంగిటి నరేష్, సుమలత వద్ద 7.92 లీటర్ల అక్రమ మద్యంను స్వాధీనం చేసుకున్నామని, వారిపై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. అక్రమ మద్యం స్వాధీనం ఘటనలో సిబ్బంది దత్తాద్రి, శ్రీనివాస్‌రెడ్డి, జగదీష్, రాణిలు పాల్గొన్నారని ఆయన వెల్లడించారు.
బోధన్ ఎస్‌బీఐలో రూ. 5లక్షల నగదు చోరీ
బోధన్‌టౌన్(బోధన్): పట్టణంలోని ఎస్‌బీఐ బ్యాంకులో రూ. 5లక్షలు చోరీ జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పట్టణ సీఐ వెంకటనారాయణ తెలిపిన వివరాలు ఇలా.. పట్టణంలోని ఎస్‌బీఐ బ్యాంకులో ఈ నెల 8న బ్యాంకు కార్యకలాపాలు నిర్వహిస్తున్న సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు కౌంటర్ నుంచి రూ. 5లక్షలను చోరీ చేశారు. ఈ విషయాన్ని బ్యాంకు అధికారులు 10వ తేదీన గుర్తించగా, పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారని సీఐ గురువారం తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. బ్యాంకు కార్యాకలాపాలు జరిగే సమయంలో బ్యాంకు అధికారులు ఎవరు ఏమి చేస్తున్నారో గమనించాలని, బ్యాంకు సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సీఐ తెలిపారు.

యువకుడి అదృశ్యం