
సాక్షి జర్నలిస్టులపై దాడులు హేయమైన చర్య
ఆంధ్రప్రదేశ్‌లో సాక్షి పత్రిక, ఛానల్ కార్యాలయాలతో పాటు జర్నలిస్టులపై రాజకీయ క క్షతో దాడులకు పా ల్పడటం హేయమైన చర్య. పత్రికా వ్యవస్థపై దాడులను జర్నలిస్టు సంఘాలు సహించవు. నిజాలు రాస్తే జీర్ణించుకోలేని పాలకులు ఇలాంటి దాడుల తో రాబోయే తరాలకు ఏం సందేశం ఇస్తున్నారో అ ర్థం కాని పరిస్థితుల్లో సమాజం ఉంది. తప్పులు రాస్తే కోర్టులను ఆశ్రయించే అవకాశం ఉన్నప్పటికీ.. ప్రశ్నించే గొంతుకను అణచివేసేందుకు దాడు లు జరిపినంత మాత్రాన జర్నలిస్టులు భయప డతారని అనుకోవడం భ్రమనే అవుతుంది. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధులుగా వ్యవహరిస్తు న్న జర్నలిస్టులపై దాడులను ప్రతిఒక్కరు ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. – దురిశెట్టి నర్సింహా చారి, సీనియర్ జర్నలిస్టు, నిజామాబాద్