
వాక్ స్వాతంత్య్రంపై దాడి
నూతన ఆర్థిక విధానా లు వచ్చిన తర్వాత కార్మికవర్గ సమస్య లు, రైతాంగ సమస్యలు పెరిగిపోతున్నాయి. వీటికోసం జరుగుతున్న ఉద్యమాలను బయటపెడుతున్న పత్రికలను తమ గుప్పిట్లో పెట్టుకోవడానికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అక్రమకేసులు పెడుతోంది. ఇది ఖచ్చితంగా వాక్ స్వాతంత్య్రంపై దాడిగానే పరిగణిస్తాం. పత్రికా స్వేచ్ఛపై దాడులు చేయడమంటే నాలుగో స్తంభానికి ప్రమాదం పొంచివున్నట్లే. దీనికి ప్రధాన బాధ్యత ప్రభుత్వాలదే. నిర్బంధం, అణచివేతలు ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు. ఇటువంటి అప్రజాస్వామిక చర్యలను పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. అక్రమ కేసులను బేషరతుగా రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. – వుప్పల ప్రభాకర్,
సీపీఐఎంఎల్ (ప్రజాపంథా) జిల్లాకమిటీ కార్యదర్శి