
కేఎఫ్‌సీలో ఫుడ్‌సేఫ్టీ అధికారుల తనిఖీలు
నిజామాబాద్ సిటీ/ నిజామాబాద్‌లీగల్: జిల్లా కేంద్రంలోని పలు హోటళ్లపై జిల్లా ఫుడ్‌సేప్టీ అధికారులు దాడులు చేశారు. బుధవారం సాయంత్రం నగరంలోని వేణుమాల్‌లో నిర్వహిస్తున్న కేఎఫ్‌సీపై ఫుడ్ సేఫ్టీ ఇన్‌స్పెక్టర్ సునీత బృందం తనిఖీలు చేపట్టారు. చికెన్, ఫాస్ట్‌ఫుడ్ తయారీలో ఉపయోగించే పదార్థాల శాంపిల్స్ సేకరించి ల్యాబ్‌కు పంపారు. మున్సిపల్ శానిటేషన్ అధికారులు సైతం తనిఖీలు చేశారు. కిచెన్ అపరిశుభ్రంగా ఉండటంతో రూ.10 వేల జరిమానా విధించారు. గత రెండు రోజుల క్రితం కేఎఫ్‌సీ చికెన్ ముక్కలు కుళ్లిపోయి ఉండ టం, పాచి వాసన వస్తుండటంతో కస్టమర్లు యజమానిని నిలదీశారు. నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడంతో వీడియో తీసి వైరల్ చేశారు. దీంతో ఫుడ్ సేఫ్టీ అధికారులు కేఎఫ్‌సీపై తనిఖీలు నిర్వహించారు. అనారోగ్యకర ఆహార పదార్థాలు సరఫరాచేస్తే చట్టరీత్యా చర్యలు తప్పవని శానిటరీ ఇన్‌స్పెక్టర్ సాజిద్ అలీ హెచ్చరించారు. తనిఖీల్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు జి. నవీత, జి. విక్రమ్, శానిటరీ ఇన్‌స్పెక్టర్ ఆకుల సునీల్, సిబ్బంది ఉన్నారు.

కేఎఫ్‌సీలో ఫుడ్‌సేఫ్టీ అధికారుల తనిఖీలు