
వైద్య సిబ్బందికి హెపటైటిస్ టీకాలు
నిజామాబాద్‌నాగారం: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో హెపటైటిస్ బి టీకాల కార్యక్రమాన్ని డీఎంహెచ్‌వో రాజశ్రీ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జిల్లాలో మొదటి విడతలో హెపటైటిస్ బి వ్యాక్సిన్‌ను ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బందికి ఇచ్చినట్లు పేర్కొన్నారు. వైద్య సిబ్బంది వారి విధుల్లో భాగంగా హెపటైటిస్ బి వ్యాధికి గురికాకుండా ఉండేందుకు ముందు జాగ్రత్త చర్యగా ఈ టీకాలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో జీజీహెచ్ సూపరింటెండెంట్ శ్రీనివాసరావు, డీసీహెచ్ శ్రీనివాస ప్రసాద్, ప్రోగ్రామ్ ఆఫీసర్ తుకారం రాథోడ్, డీఐవో అశోక్, డిప్యూటీ డీఎంహెచ్‌వో అంజన, డీటీసీ దేవి నాగేశ్వరి, డాక్టర్ రాజు, డాక్టర్ సుప్రియ, వివిధ విభాగాల అధిపతులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
కామారెడ్డి రూరల్: కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని పాతరాజంపేటలో మంగళవారం మృతి చెందిన సల్మా బేగం అంత్యక్రియలు బుధవారం గ్రామస్తులు, దత్తత తీసుకున్న కుమార్తె కరిష్మా చేతుల మీదుగా నిర్వహించారు. సల్మాబేగం మృతి చెందగా హైదరాబాద్ నుంచి ఓ వ్యక్తి వచ్చి తానే సల్మాబేగం కుమారుడని తానే అంత్యక్రియలు చేస్తానని తెలుపగా అందుకు గ్రామస్తులు అంగీకరించలేదు. అయితే దత్తత తీసుకున్న కరిష్మా బేగంతో గ్రామస్తులు అంత్యక్రియలు నిర్వహించారు. ఇదిలా ఉండగా తానే కొడుకునని చెప్పుకొనే వ్యక్తి అంత్యక్రియల అనంతరం హైదరాబాద్ నుంచి వచ్చిన తన బంధువులతో కలిసి తిరిగి వెళ్లిపోయినట్లు గ్రామస్తులు తెలిపారు.