
చాకలి ఐలమ్మ చరిత్ర మరువలేనిది
ఖలీల్‌వాడి: తెలంగాణ సాయుధ పోరాటంలో చాకలి ఐలమ్మ చరిత్ర మరువలేనిదని డీసీపీ బస్వారెడ్డి అన్నారు. నగరంలోని నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో చాకలి ఐలమ్మ వర్ధంతి నిర్వహించారు. ఆమె చిత్రపటానికి డీసీపీ పూలమాల వేసి నివాళులు అర్పించారు. తెలంగాణ సాయుధ పోరాటంలో ఐలమ్మ ప్రదర్శించిన ధైర్యసాహసాలు, ప్రజాస్వామిక పోరాటాలకు స్ఫూర్తిగా నిలిచాయన్నారు. కార్యక్రమంలో కార్యాలయ సూపరింటెండెంట్ శంకర్, బషీర్, వనజ రాణి, స్పెషల్ బ్రాంచ్ సీఐ శ్రీశైలం, రిజర్వ్ సీఐలు శ్రీనివాస్, తిరుపతి, సిబ్బంది పాల్గొన్నారు.