దిద్దుబాటు | - | Sakshi
Sakshi News home page

దిద్దుబాటు

Sep 10 2025 10:00 AM | Updated on Sep 10 2025 1:34 PM

దిద్ద

దిద్దుబాటు

నిజామాబాద్‌ సిటీ: నిజామాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌లోని రెవె న్యూ విభాగంపై ఓ వైపు తీవ్రస్థాయి లో అవినీతి ఆరోపణలు వ్యక్తం అవుతు న్నాయి. మరోవైపు ఇటీవలే రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాస్‌ లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కా రు. కార్పొరేషన్‌లో పరిస్థితులపై కలెక్టర్‌, కార్పొరేషన్‌ ప్రత్యేకాధికారి వినయ్‌కృష్ణారెడ్డితోపాటు వరంగల్‌లోని రీజినల్‌ డైరెక్టర్‌ కార్యాలయం ఆరా తీశారు. దీంతో మున్సిపల్‌ కమిషనర్‌ దిలీప్‌కుమార్‌ నేరుగా రంగంలోకి దిగి దిద్దుబాటు చర్యలు చేపట్టారు.

మ్యుటేషన్‌కు అక్షరాలా లక్ష..?

ఆస్తి ఒకరి పేరు మీద నుంచి మరొకరి పేరు మీదకు మార్చేందుకు(మ్యుటేషన్‌)కు రెవెన్యూ సిబ్బంది రూ.లక్ష డిమాండ్‌ చేస్తున్నారని పలువురు వాపోతున్నారు. కిందిస్థాయి నుంచి పైస్థాయి వరకు ఇదే పరిస్థితి ఉందని, పేర్లలో కరెక్షన్‌ చేయాలంటే రూ.30 వేలు డిమాండ్‌ చేస్తున్నారని అంటున్నారు. డబ్బులిచ్చినవారి పనులు మాత్రమే అవుతున్నాయని, డబ్బులివ్వని వారిని నెలల తరబడి తిప్పుకుంటున్నారని, గట్టిగా ప్రశ్నిస్తే మీ ఫైల్‌ కనపడటం లేదని నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ప్రముఖ న్యాయవాది కుటుంబానికి చేదు అనుభవం

గతేడాది డిసెంబర్‌లో మృతి చెందిన ప్రముఖ న్యాయవాది, మానవ హక్కుల నాయకుడు గొర్రెపాటి మాధవరావు కుటుంబానికి చేదు అనుభవం ఎదురైంది. ఎల్లమ్మగుట్టలోని ఇంటిని మాధవరావు పేరు పైనుంచి తన పైరుపైకి మార్చాలని ఆయన భార్య మీనా సహానీ 25న మార్చి 2025న దరఖాస్తు చేశారు. ఇప్పటివరకు వారికి మ్యుటేషన్‌ సర్టిఫికేట్‌ ఇవ్వకపోగా.. డబ్బులిస్తేనే మీ పని అవుతుందని నేరుగా చెప్పారు. దీంతో మీనా సహానీ మున్సిపల్‌కమిషనర్‌కు, జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదుచేసినా ఇప్పటివరకు పని కాలేదు.

ఆన్‌లైన్‌ పేమెంట్‌..

పని చేయాలంటే డబ్బులు డిమాండ్‌ చేస్తున్న పలువురు అధికారులు లంచం మొత్తాన్ని నేరుగా తమ అకౌంట్‌లోకి ఆన్‌లైన్‌ చేయించుకుంటున్నట్లు సమాచారం. ఇటీవల ఏసీబీకి చిక్కిన ఆర్‌ఐ శ్రీనివాస్‌ సైతం ఆర్మీ జవాన్‌ను ఫోన్‌ పే చేయమని కోరారు. ఏసీబీ దాడి తరువాత ఓ బాధితుడు నేరుగా ఏసీబీ అధికారిని కలిసి తాను ఆన్‌లైన్‌ ద్వారా రూ.17వేలు చెల్లించినట్లు ఫిర్యాదు చేశాడని తెలిసింది. మీ పని కావాలంటే తన కిందిస్థాయి అధికారిని కలిసి రా వాలని రెవెన్యూ విభాగం ఉన్నతాధికారి ఒకరు సూ చిన్నారనే ఆరోపణలున్నాయి. 20 ఏళ్లకుపైగా బల్ది యా రెవెన్యూ విభాగాన్ని శాసించిన ఆర్‌ఐ దాసరి నరేందర్‌ శిష్యులు ఇప్పటికీ చక్రం తిప్పుతున్నారని, అన్ని స్థాయిల్లో వారున్నారని పలువురు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. బల్దియాలోని రెవెన్యూ, టౌన్‌ప్లానింగ్‌, శానిటేషన్‌ విభాగాల్లో ఫిర్యాదులు స్వీకరించేందుకు గ్రివెన్స్‌ సెల్‌ ఏర్పాటు చేస్తే వంద ల సంఖ్యలో ఫిర్యాదులు అందుతాయంటున్నారు.

ఫైళ్లపై రిపోర్టు..

మ్యుటేషన్‌, అసెస్‌మెంట్‌, రీ అసెస్‌మెంట్‌, అలాట్‌మెంట్‌, నేమ్‌ చేంజెస్‌, ట్రేడ్‌ లైసెన్స్‌ల జారీ తదితర అనుమతులకు సంబంధించి ఫైళ్లన్నీ కమిషనర్‌ తెప్పించారు. రెవెన్యూ సెక్షన్‌ నుంచి ఈ సంవత్సరం జనవరి నుంచి ఇప్పటివరకు అనుమతులు మంజూరు చేసిన ఫైళ్ల వివరాలు తెలుసుకున్నారు. మ్యుటేషన్‌కు సంబంధించిన ఫైళ్లను రీ వెరిఫికేషన్‌ చేయాలని అడిషనల్‌ కమిషనర్‌ రవీంద్రసాగర్‌కు సూచించారు. వాటితోపాటు దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉంచిన ఫైళ్లను కూడా తెప్పించి వాటిపై రిపోర్టు సిద్ధం చేయాలని రెవెన్యూ ఆఫీసర్‌ ఖయ్యూంను ఆదేశించారు.

కలెక్టర్‌ ప్రత్యేక సమీక్ష

నిజామాబాద్‌ సిటీ: మున్సిపల్‌ కార్పొరేషన్‌లోని రెవెన్యూ విభాగం అధికారులు, సిబ్బందితో జిల్లా కలెక్టర్‌, మున్సిపల్‌ ప్రత్యేక అధికారి టి.వినయ్‌కృష్ణారెడ్డి సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. మంగళ వారం సాయంత్రం రెండుగంటల పాటు సమావేశమయ్యారు. ఇటీవలే రెవెన్యూ ఇన్స్‌పెక్టర్‌ శ్రీనివాస్‌ ఏసీబీకి పట్టుబడిన విషయం తెలిసిందే. ఈ అంశంపై వరంగల్‌లోని రీజనల్‌ డైరెక్టర్‌ (రెవె న్యూ) రిపో ర్టు అడిగినట్లు తెలిసింది. దీంతో ము న్సిపల్‌ కమిషనర్‌, రెవెన్యూ టీంతో కలెక్టర్‌ ప్రత్యే క సమావేశం నిర్వహించారు. మ్యుటేషన్‌, అసెస్‌ మెంట్‌, రీ అసెస్‌మెంట్‌, అలాట్‌మెంట్‌, పేరుమార్పులు, ట్రేడ్‌ లై సెన్సులపై నివేదిక తీసుకున్నారు. రెవెన్యూ విభా గం ఇన్‌చార్జి డిప్యూటీ కమిషనర్‌ రవి బాబు, రెవెన్యూ అధికారులతో మాట్లాడారు. మ్యుటేషన్ల జారీ, పెండింగ్‌ పనులకు సంబంధించిన ఫైళ్లను తీసి చెక్‌ చేశారు. సర్కిళ్ల వారీగా పెండింగ్‌ రెవెన్యూ ఫైళ్లపై ఆరా తీశారు. సుదీర్ఘ కాలం నుంచి పలు మ్యుటేషన్‌ ఫైళ్లు పెండింగ్‌ లో ఉండడాన్ని గమనించిన కలెక్టర్‌, వాటి విషయమై సంబంధిత జోన్ల రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లను ప్రశ్నించారు. సత్వరమే పెండింగ్‌ దరఖాస్తులను పరిష్కరించాలని, తద్వారా నగర పాలక సంస్థకు ఆదాయం కూడా సమకూరుతుందని కలెక్టర్‌ సూచించారు. పన్ను వసూళ్లపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని సూచించారు. భవన నిర్మాణాలకు అనుమతులు, క్రమబద్ధీకరణ, ఎల్‌ఆర్‌ఎస్‌, ఇంజినీరింగ్‌ పనుల పురోగతిపై ఆరా తీశారు.

ప్రక్షాళన చేపట్టాం

బల్దియాలో ఇటీవల జరిగిన పరిణామాలు బాధాకరం. రెవెన్యూలో జరుగుతున్న అవకతవకలపై దృష్టి సారించాం. ఇప్పటివరకు అనుమతి ఇచ్చిన ఫైళ్లను తెప్పించాం. అని ఫైల్లను రీ వెరిఫికేషన్‌ చేయిస్తున్నా. పెండింగ్‌లో ఉన్న ఫైళ్లపై వివరణ తీసుకుంటున్నా. తప్పుచేస్తే ఎంత పెద్ద అధికారి అయినా చర్యలు తప్పవు.

– దిలీప్‌కుమార్‌, బల్దియా కమిషనర్‌

దిద్దుబాటు1
1/3

దిద్దుబాటు

దిద్దుబాటు2
2/3

దిద్దుబాటు

దిద్దుబాటు3
3/3

దిద్దుబాటు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement