
ఉత్తమ గురువులకు సన్మానం
● ఘనంగా గురుపూజోత్సవం
● విద్యలో జిల్లాను అగ్రభాగాన నిలపాలని రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి పిలుపు
నిజామాబాద్‌అర్బన్: గురుపూజోత్సవాన్ని విద్యాశాఖ ఆధ్వర్యంలో మంగళవారం ఘ నంగా నిర్వహించారు. సమీకృత జిల్లా కార్యా లయాల సముదాయం కాన్ఫరెన్స్ హాల్‌లో కా ర్యక్రమాన్ని నిర్వహించగా.. ముఖ్య అతిథు లుగా నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి, కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి పాల్గొన్నారు. జిల్లా స్థాయిలో ఉత్తమ టీచర్లుగా ఎంపికైన 40 మందిని ఘనంగా సన్మానించి జ్ఞాపికలను అందజేశారు. అంతకుముందు మాజీ రాష్ట్ర పతి సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూ లమాలలు వేసి నివాళులర్పించారు. భూపతి రెడ్డి మాట్లాడుతూ.. ఉపాధ్యాయ వృత్తికి మించిన వృత్తి సమాజంలో మరేదీ లేదని, విద్యార్థులకు నాణ్యమైన విద్యనందిస్తూ జిల్లాను వి ద్యా రంగంలో అగ్రభాగాన నిలుపుదామని పిలుపునిచ్చారు. సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమైందని, గురు వు స్థానానికి ఉన్న గౌ రవాన్ని మరింత ఇనుమడింపజేయాలని హితవు పలికారు. అదన పు కలెక్టర్ అంకిత్, ఉపాధ్యాయ సంఘాల నాయకులు మోహన్‌రెడ్డి, కిషన్, వెనిగళ్ల సురేశ్, గద్దల రమేశ్, వెంకటేశ్వర్‌గౌడ్, జలంధర్, హెచ్‌ఎంలు, టీచర్లు పాల్గొన్నారు.