
సమస్య పరిష్కారం కోసం.. సాష్టాంగ నమస్కారం
● న్యాయం చేయాలని సబ్ కలెక్టర్ ఆఫీస్ ఎదుట వినూత్న నిరసన
ఆర్మూర్‌టౌన్: తమ భూమిని కబ్జా చేసిన కొందరు 12 ఏళ్లుగా ఇబ్బందులు పెడుతున్నారని నీరడి సాయన్న అనే వ్యక్తి కుటుంబ సభ్యులతో కలిసి సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట వినూత్న నిరసన తెలిపాడు.
ఆర్మూర్ మండలంలోని ఇస్సాపల్లికి చెందిన నీరడి సాయన్న మంగళవారం సబ్ కలెక్టర్ కార్యాలయా నికి చేరుకొని కుటుంబ సభ్యులతో కలిసి సాష్టాంగ నమస్కారం చేస్తూ తన సమస్యను వివరించాడు. అనంతరం న్యాయం చేయాలని కోరుతూ సబ్‌కలెక్టర్ అభిగ్యాన్ మాల్వియాకు వినతిపత్రం అందజేశారు. వివరాలు తెలుసుకున్న సబ్‌కలెక్టర్ న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు.
సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద సాష్టాంగ నమస్కారం చేస్తున్న నీరడి సాయన్న
సబ్‌కలెక్టర్ అభిగ్యాన్ మాల్వియాకు
తమ సమస్యను వివరిస్తూ..

సమస్య పరిష్కారం కోసం.. సాష్టాంగ నమస్కారం