
ఉప రాష్ట్రపతి ఎన్నిక.. ఓటేసిన ఎంపీ అర్వింద్
వర్చువల్‌గా జీజీహెచ్‌లో క్యాన్సర్ సెంటర్ ప్రారంభం
నిజామాబాద్‌నాగారం: జిల్లా కేంద్ర ప్రభుత్వ జ నరల్ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన డే కేర్ క్యాన్సర్ సెంటర్‌ను ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహా మంగళవారం వర్చువల్‌గా ప్రారంభించారు. సెంటర్‌లో క్యాన్సర్ రోగులకు ఉదయం నుంచి సాయంత్రం వరకు చికిత్స అందుతుందని, ఇప్పటివరకు హైదరాబాద్‌లోని ఎమ్‌జే క్యాన్సర్ ఆస్పత్రిలో మొదటి డోస్ చికిత్స పొందిన రోగులు రెండో డోస్ నుంచి డే కేర్ సెంటర్‌లోనే చికిత్స పొందవచ్చిన మంత్రి అన్నారు. అలాగే అవసరమైన సెంటర్‌లో అందుబాటులో ఉన్నాయని తెలిపారు. జీజీహెచ్ సూపరింటెండెంట్ శ్రీనివాస్, ఆర్థో హెచ్‌వోడీ రాములు, డాక్టర్లు కిశోర్, చైతన్య, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ఉప రాష్ట్రపతి ఎన్నిక.. ఓటేసిన ఎంపీ అర్వింద్