
పోలీసులు నిక్కచ్చిగా విధులు నిర్వహించాలి
బోధన్‌రూరల్: పోలీస్ ఇమేజ్ పెంచేవిధంగా ప్రతీ సిబ్బంది నిక్కచ్చిగా విధులు నిర్వహించాలని నిజామాబాద్ సీపీ సాయి చైతన్య అన్నారు. బోధన్ రూరల్ పోలీస్ స్టేషన్‌ను మంగళవార సీపీ సందర్శించారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ.. అండర్ ఇన్వెస్టిగేషన్‌లో ఉన్న కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రతి కేసులో నాణ్యమైన ఇన్వెస్టిగేషన్ చేయాలని సిబ్బందికి సూచనలు చేశారు. ప్రజలకు గేమింగ్ యాప్స్, సైబర్ మోసాలపై అవగాహన కల్పించాలన్నారు. గ్రామాలలో విలేజ్ పోలీస్ ఆఫీసర్‌గా విధులు నిర్వహిస్తూ ప్రజలతో మమేకమై గ్రామాలలో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించే దిశగా ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. అట్టి గ్రామాలలో ఉన్నటువంటి సమాచారం తమ పైస్థాయి అధికారులకు ఎల్లప్పుడూ చేరవేయాలన్నారు. అధికారులు, సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. ట్రాఫిక్ రూల్స్‌ను పాటిస్తూ ఇతరులకు ఆదర్శంగా ఉండాలని సూచించారు. బోధన్ ఏసీపీ శ్రీనివాస్, రూరల్ సీఐ విజయ్ బాబు, ఎస్‌హెచ్‌వో వెంకట నారాయణ, ట్రాఫిక్ సీఐ చందర్ రాథోడ్, ఏస్సైలు మచ్చేందర్, రమ, చంద్రమోహన్, సిబ్బంది పాల్గొన్నారు.