ప్రమాదకరంగా విద్యుత్‌ వైర్లు | - | Sakshi
Sakshi News home page

ప్రమాదకరంగా విద్యుత్‌ వైర్లు

Sep 10 2025 2:04 AM | Updated on Sep 10 2025 2:04 AM

ప్రమా

ప్రమాదకరంగా విద్యుత్‌ వైర్లు

ప్రమాదకరంగా విద్యుత్‌ వైర్లు పంటలకు డ్రోన్లతో మందుల పిచికారి రాష్ట్రస్థాయి బ్యాడ్మింటన్‌ పోటీల్లో రన్నర్‌గా శ్రీ వైభవి పాత రాజంపేటలో నిలిచిన అంత్యక్రియలు

నందిపేట్‌(ఆర్మూర్‌): నందిపేట మండలం కౌల్‌పూర్‌ గ్రామంలో గృహాల మీదుగా ఏర్పాటు చేసిన విద్యుత్‌ తీగలు ప్రమాదకరంగా మారాయి. ఇళ్ల సమీపంలో నుంచి వెళ్తున్న వైర్లు చేతికి అందే దగ్గరలో ఉన్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. వైర్లు కిందకు ఉండటంతో విద్యుత్‌ ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ఆవేదన చెందుతున్నారు. సమస్యను విద్యుత్‌ అధికారులకు తెలిపినా పరిష్కారం కావడం లేదని, ఇప్పటికై నా స్పందించి సమస్యను పరిష్కరించాలని గ్రామస్తులు కోరుతున్నారు.

నవీపేట: నవీపేట శివారులోని పంట పొలంలో రైతు గోపాల్‌ ఆధునిక డ్రోన్ల సహాయంతో మంగళవారం క్రిమిసంహారక మందులను పి చికారి చేశారు. 20 ఎకరాల వరి పొలంలో తక్కువ ఖర్చుతో క్రిమిసంహారక మందులను పిచికారి చేశారు. ఎకరానికి రూ. 300 నుంచి రూ.350 వరకు ఖర్చు అయిందని రైతు తెలిపారు. కేవలం రెండున్నర గంటలలో 20 ఎకరాల వరి పొలంలో క్రిమిసంహారక మందుల ను డ్రోన్‌ ద్వారా స్ప్రే చేసినట్లు పేర్కొన్నారు. డ్రోన్ల వాడకంతో సమయం ఆదా అవడంతోపాటు ఖర్చులు తగ్గాయని అన్నారు.

నిజామాబాద్‌నాగారం: ఇటీవల మహబూబ్‌నగర్‌లో జరిగిన 11వ రాష్ట్ర సబ్‌ జూనియర్‌ బ్యాడ్మింటన్‌ చాపియన్‌ షిప్‌ పోటీల్లో నిజామాబాద్‌ జిల్లాకు చెందిన అనుముల శ్రీవైభవి సింగిల్స్‌ విభాగంలో రన్నర్‌గా నిలిచింది. ఈసందర్బంగా జిల్లా బాడ్మింటన్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు కర్నాటి వాసు, సెక్రెటరీ కిరణ్‌ కుమార్‌, కోశాధికారి సాయరెడ్డిలు మంగళవారం ఆమె కు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. శ్రీ వైభవి జూన్‌లో గోవాలో జరిగిన అండర్‌ 13 నే షనల్‌ ర్యాంకింగ్‌ టోర్నమెంట్‌, ఆగస్టులో ముంబాయి లో జరిగిన అండర్‌ 13 నేషనల్‌ ర్యాంకింగ్‌ టోర్నమెంట్‌లో కూడా ప్రతిభ కనబర్చి రెండు బంగారు పతకాలు సాధించి జిల్లాకి, రాష్ట్రానికి వన్నె తెచ్చిందన్నారు.

గ్రామంలో మృతిచెందిన సల్మాబేగం

ఏళ్ల క్రితం ఇంట్లోంచి వెళ్లిన

మృతురాలి కుమారుడు

అంత్యక్రియలు చేయడానికి తిరిగిరాగా, ఒప్పుకోని స్థానికులు

దత్తత కుమార్తె కరిష్మా బేగం

చేయాలని నిర్ణయించిన గ్రామస్తులు

కామారెడ్డి రూరల్‌: తల్లిని కంటికి రెప్పలా కాపాడుకొని ఆసరాగా ఉండాల్సిన కుమారుడు 20 ఏళ్ల క్రితం ఇల్లు వదిలి వెళ్లిపోయాడు. కుమారుడు వెళ్లిపోయాడని ఆ తల్లి కుంగిపోలేదు. కామారెడ్డిలో దొరికిన ఒక అమ్మాయిని పెంచుకుని పెళ్లి చేసి పంపించింది. మంగళవారం ఆ తల్లి మృతి చెందగా చెందగా ‘తానే కొడుకునని అంత్యక్రియలు నేనే చేస్తాను. మా ఊరికి తీసుకెళ్తాను’ అని వచ్చిన కొడుకును నువ్వెవరో తెలియదు అని వెల్లగొట్టారు. ఈ ఘటన కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని పాత రాజంపేటలో చోటుచేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన సల్మాబేగంను 20 సంవత్సరాల క్రితం కుమారుడు వదిలి వెళ్లిపోయాడు. ఒక్కగానొక్క కొడుకు తనను వదిలి వెళ్లిపోవడంతో కొద్దిరోజులు బాధపడింది. తన రాత ఇంతే అనుకుని జీవిస్తుండగా కొద్దిరోజులకు కామారెడ్డి పట్టణంలో దొరికిన కరిష్మా బేగం అనే చిన్నారిని పెంచుకుంది. పెద్దయ్యాక సల్మాబేగం.. కరిష్మాకు పెళ్లి చేసి బాధ్యత తీర్చుకుంది. పెళ్లయినా పెంచిన తల్లి మంచి చెడులన్నీ కరిష్మానే చూసుకుంది. గ్రామంలో కూడా మంచి పేరు తెచ్చుకుంది. అయితే మంగళవారం సల్మాబేగం మృతి చెందింది. 20 ఏళ్లుగా అటువైపు రాని కొడుకు తల్లి చనిపోయిన విషయం తెలుసుకొని, అంత్యక్రియలు చేస్తానని తల్లి శవాన్ని తీసుకొని వెళ్లేందుకు గ్రామానికి వచ్చాడు. దాంతో కొడుకుతో గ్రామస్తులు వాగ్వాదానికి దిగారు. 20 ఏళ్ల తర్వాత తల్లి ఇప్పుడు గుర్తుకొచ్చిందా అంటూ నిలదీశారు. అయితే ఇన్నేళ్ల పాటు సల్మాబేగం మంచి చెడులు చూసిన కరిష్మాయే అంత్యక్రియలు చేయాలని నిర్ణయించారు. ఇన్నాళ్లుగా లేని ప్రేమ తల్లి చనిపోయాక రావడంతో ఆస్తి కోసమే వచ్చి ఉంటాడని గ్రామస్తులు అనుమానిస్తున్నారు. ఈ విషయం పోలీసుల దాకా వెళ్లడంతో అంత్యక్రియలు నిలిచిపోయాయి.

ప్రమాదకరంగా విద్యుత్‌ వైర్లు
1
1/2

ప్రమాదకరంగా విద్యుత్‌ వైర్లు

ప్రమాదకరంగా విద్యుత్‌ వైర్లు
2
2/2

ప్రమాదకరంగా విద్యుత్‌ వైర్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement