
రాష్ట్రస్థాయి క్రీడల్లో విద్యార్థుల ప్రతిభ
ఇందల్వాయి: మండలంలోని ఏకలవ్య ఆదర్శ గురుకుల పాఠశాల విద్యార్థినులు రాష్ట్ర స్థాయి క్రీడల్లో విజేతలుగా నిలిచినట్లు ప్రిన్సిపాల్ రమేశ్ కుమార్ మంగళవారం తెలిపారు. ఈ నెల 6 నుంచి 8వ తేదీ వరకు రాజన్న సిరిసిల్ల జిల్లా టీజీ ఈఎంఆర్‌ఎస్ మరిమడ్లలో నిర్వహించిన 5వ రాష్ట్రస్థాయి క్రీడల్లో పాఠశాల విద్యార్థినులు పాల్గొన్నట్లు ఆయన పేర్కొన్నారు. అండర్–19 వాలీబాల్ విభాగంలో విద్యార్థినులు జి. కృష్ణవేణి, బి. పూజ, ఆర్. అఖిల, పి.సంగీత, ఆర్. వైష్ణవి, ఎ. వాణి ప్రథమ స్థానంలో నిలిచి విన్నర్ ట్రోఫీని అందుకున్నారని అన్నారు. ఈ బృందం జాతీయ పోటీలకు ఎంపికై ందన్నారు. అలాగే ఖోఖో లో రన్నరప్‌గా విద్యార్థినులు ఎల్. సౌందర్య, సావిత్రి, సింధు, బిందు, అమూల్య, అక్షయ, సోనియా, సరస్వతి, అపూర్వ నిలిచారు. వీరిని హెచ్‌ఎం అభినందించి హర్షం వ్యక్తం చేశారు. బాక్సింగ్ అండర్ 19లో తేజశ్విని, హారిక, అండర్ 14లో షణ్ముఖ ప్రియ, జూడో అండర్ 19లో హారిక, తేజశ్విని, అండర్ 14లో ప్రసన్న, అర్చన, రెజ్లింగ్ అండర్ 19లో హారిక, శిరీష అండర్ 14లో మాధవి, వెయిట్ లిఫ్టింగ్ అండర్ 19లోసోని, హారిక, శిరీష, తేజశ్విని, తైక్వాండో అండర్ 14లో నిత్య, సౌందర్య, అండర్ 19లో రజిత, షార్ట్ పుట్ అండర్ 19లో కృష్ణవేణి, డిస్కస్ థ్రో అండర్ 14లో బిందు, లాంగ్ జంప్ అండర్ 14లో శృతితోపాటు పలువురు రన్నింగ్ యోగా పోటోల్లో ప్రతిభ చాటారన్నారు. ఈ క్రీడల్లో విద్యార్థులు 9 బంగారు పతకాలు, 6 వెండి పతకాలు, 10 రజత పతకాలు సాధించినట్లు పేర్కొన్నారు. అనంతరం విజయాలను సాధించడంలో ముఖ్య పాత్ర పోషించిన పీఈటీ దివ్య, రోహిత్‌లను ప్రిన్సిపాల్ అభినందించారు.
నిజామాబాద్‌నాగారం: నిర్మల్‌లో ఈనెల 5, 6, 7 తేదీల్లో నిర్వహించిన రాష్ట్రస్థాయి యోగాసన పోటీల్లో నిజామాబాద్ జిల్లా క్రీడాకారులు పతకాల పంట తెచ్చారు. జిల్లాకు చెందిన క్రీడాకారులు వివిధ విభాగాల్లో ప్రతిభ చాటి రెండు బంగారు, 7 రజత, 8 కాంస్య పతకాలు మొత్తం 17 పతకాలు సాధించి సత్తా చాటారు. రాష్ట్రస్థాయి విజేతలను రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నందనమ్ కృపాకర్, కార్యనిర్వాక కార్యదర్శి రామ్‌రెడ్డి, జిల్లా గౌరవ అధ్యక్షుడు యోగ రామచందర్, అధ్యక్షుడు ప్రభాకర్, ప్రధాన కార్యదర్శి బాలశేఖర్, కార్యనిర్వాహక కార్యదర్శి సంగీత, భూమాగౌడ్, రఘువీర్, జ్యోతి, ఉమారాణి తదితరులు క్రీడాకారులను అభినందించారు.
తెయూ(డిచ్‌పల్లి): తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో ఏర్పాటు చేసిన ఐదు పరీక్షా కేంద్రాల్లో బీఈడీ, ఎంఈడీ సెమిస్టర్ పరీక్షలు మంగళవారం ప్రశాంతంగా ముగిసినట్లు అకడమిక్ ఆడిట్ సెల్ డైరెక్టర్ ఘంటా చంద్రశేఖర్ ఒక ప్రకటనలో తెలిపారు. బీఈడీ 2, 4వ సెమిస్టర్ రెగ్యులర్, బ్యాక్‌లాగ్ పరీక్షల్లో మొత్తం 1145 మంది విద్యార్థులకు గానూ 1088 మంది హాజరైనట్లు తెలిపారు. ఎంఈడీ నాలుగవ సెమిస్టర్ రెగ్యులర్, 1, 2, 3, 4వ సెమిస్టర్ బ్యాక్‌లాగ్ పరీక్షల్లో మొత్తం ముగ్గురు విద్యార్థులకు ముగ్గురు హాజరైనట్లు ఆయన తెలిపారు.
నిజామాబాద్ సిటీ: నగర మున్సిపల్ కార్పొరేషన్‌లో వార్డు ఆఫీసర్లుగా విధులు నిర్వహిస్తున్న 18 మంది సిబ్బంది జీపీవోలుగా ఎంపికయ్యారు. వీరంతా కలెక్టర్‌ను కలిసి ఇటీవల నియామక పత్రాలు పొందారు. దీంతో మంగళవారం 18 మంది వార్డు ఆఫీసర్లను మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్ రిలీవ్ చేశారు. వీరంతా గ్రామ పాలన అధికారులుగా విధులు నిర్వహించనున్నారు.

రాష్ట్రస్థాయి క్రీడల్లో విద్యార్థుల ప్రతిభ