
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
ఇందల్వాయి: మండల పరిధి లోని 44వ నంబరు జాతీయ ర హదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతిచెందాడు. ఎస్సై సందీప్ తెలిపిన వివరాలు ఇలా.. అదిలా బాద్ జిల్లాలోని ఇచ్చోడకు చెందిన నరసింహారెడ్డి(21), విశాల్ అనే ఇద్దరు యువకులు హైదరా బాద్‌లో బీటెక్ చదువుతున్నారు. వారు మంగళవారం వేకువజామున కారులో హైదరాబాద్ నుంచి ఇచ్చోడకు బయలుదేరారు. ఇందల్వాయి మండలంలోని దేవితండా హైవే వద్ద వారు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి రోడ్డు పక్కన నిలిపి ఉంచిన లారీని వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నరసింహరెడ్డి అక్కడికక్కడే మృతి చెందగా, కారు నడుపుతున్న విశాల్‌కు స్వల్ప గా యాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసు లు ఘటన స్థలానికి చేరుకొని, వివరాలు సేకరించా రు. మృతదేహాన్ని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడి తండ్రి కృష్ణారెడ్డి ఫిర్యాదు మేరకు నిర్లక్ష్యంగా కారు నడిపిన విశాల్‌పై, లారీ పార్క్ చేసిన హర్యానాకు చెందిన లారీ డ్రైవర్ ఆలాంపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై సందీప్ తెలిపారు.
చెరువులో పడి వృద్ధుడు..
సిరికొండ: మండలంలోని కొండాపూర్ గ్రామ చెరువులో ఓ వృద్ధుడు పడి మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. వివరాలు ఇలా.. గోప్య తండాకు చెందిన బుక్యా శంకర్(59) అనే వృద్ధుడు సోమవారం చేపలు పట్టడానికి చెరువుకు వెళ్లాడు. రాత్రి అయిన అతడు ఇంటికి రాకపోవడంతో కుటుంబీకులు చెరువు వద్దకు వెళ్లి చూడగా శంకర్ కనిపించలేదు. చెరువు కట్టపై అతడి బట్టలు ఉండటంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. గజ ఈతగాళ్ల సహాయంతో చెరువులో వెతకగా చెరువులో శంకర్ మృతదేహం లభ్యమైంది. మృతుడి కొడుకు సుమన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రామకృష్ణ తెలిపారు.

రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి