
ఎల్‌వోసీ విధానంలో చెల్లింపులకు చర్యలు చేపట్టాలి
● మార్కెట్ కమిటీ చైర్మన్ల ఫోరం
రాష్ట్ర అధ్యక్షుడు ముప్ప గంగారెడ్డి
● మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావుకు వినతి
సుభాష్‌నగర్: మార్కెట్ కమిటీ చైర్మన్, ఉద్యోగుల వేతనాలు, అలవెన్సులు, మార్కెట్‌యార్డు నిర్వహణ, ఇతరత్ర చెల్లింపులు ఈ–పోర్టల్‌లోని ఐఎఫ్‌ఎంఎస్ ద్వారా కాకుండా, ఎల్‌వోసీ విధానంలో చెల్లింపులు చేసేలా చర్యలు చేపట్టాలని మార్కెట్ కమిటీ చైర్మన్ల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు ముప్ప గంగారెడ్డి కోరారు. ఈమేరకు ఫోరం ఆధ్వర్యంలో మంగళవారం ఆయన హైదరాబాద్‌లో రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్‌శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావును కలిసి, పలు సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన విధానంతో మార్కెట్‌యార్డుల్లో చేపట్టే అభివృద్ధి పనుల చెల్లింపుల్లో జాప్యం జరుగుతుందని, కావున ట్రెజరీ ద్వారా నేరుగా చెల్లింపులు జరిపే విధంగా చూడాలని కోరారు. పాలకమండలి పదవీకాలాన్ని మూడేళ్లకు పొడగించాలని విజ్ఞప్తిచేశారు. మార్కెట్‌యార్డుల్లో అవసరమైన పోస్టులను భర్తీ చేసుకునే అధికారం చైర్మన్లకు కల్పించాలని, చైర్మన్లకు ప్రొటోకాల్ వర్తింపజేయాలని, అలాగే పలు సమస్యలను విన్నవించారు. మంత్రి తుమ్మల సానుకూలంగా స్పందించారని అధ్యక్షుడు ముప్ప గంగారెడ్డి తెలిపారు. ప్రధానకార్యదర్శి నర్సింహాయాదవ్, గౌరవాధ్యక్షుడు చిలుక మధుసూదన్‌రెడ్డి, కార్యవర్గ సభ్యులు, మార్కెట్ కమిటీ చైర్మన్లు పాల్గొన్నారు.