
సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి
కామర్స్ విభాగం డీన్‌గా ప్రొఫెసర్ యాదగిరి
బాల్కొండ: జీవాలకు సోకే సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని జిల్లా పశువైద్యాధికారి రోహిత్‌రెడ్డి పేర్కొన్నారు. బాల్కొండ మండలం బోదేపల్లి గ్రామంలో గొర్రెలకు, మేకలకు సోమ వారం పశుసంవర్థక శాఖ ఆధ్వర్యంలో ఉచితంగా టీకాలు వేశారు. జీవాలకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలను తప్పకుండా వేయించాలన్నా రు. గ్రామంలో 850 గొర్రెలు, 140 మేకలకు టీకా లు వేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో పశువైద్యాధికారి గౌతంరాజు, ఎల్‌ఎస్‌ఏ ప్రవీణ్, గోపాలమిత్రలు మల్లేశ్, షకీల్, ప్రణీత్, రైతులు పాల్గొన్నారు.
కామర్స్ విభాగం డీన్‌గా ప్రొఫెసర్ యాదగిరి
తెయూ(డిచ్‌పల్లి): తెలంగాణ యూనివర్సిటీ సీనియర్ ప్రొఫెసర్ ఎం యాదగిరి కామర్స్ విభాగం డీన్‌గా నియామకమయ్యారు. ఈ మేరకు వీసీ ప్రొఫెసర్ టి.యాదగిరిరావు నియామక ఉత్తర్వులు అందజేశారు. కామర్స్ విభాగంలో మూడు దశాబ్దాల బోధన, పరిశోధన అనుభవం కలిగిన ప్రొఫెసర్ యాదగిరి తెయూలో అనేక అడ్మినిస్ట్రేటివ్, అకడమిక్ పదవులు సమర్థంగా నిర్వహించారు. ప్రస్తుతం ప్రొఫెసర్ యాదగిరి తెయూ రిజిస్ట్రార్‌గా కొనసాగుతున్నారు.
సోషల్ సైన్స్ డీన్‌గా ప్రొఫెసర్ రవీందర్‌రెడ్డి
తెలంగాణ యూనివర్సిటీ అర్ధశాస్త్ర విభా గం ప్రొఫెసర్ కే.రవీందర్‌రెడ్డి సోషల్ సైన్స్ డీన్‌గా నియమితులయ్యారు. వీసీ ప్రొఫెసర్ టీ.యాదగిరిరావు ఆదేశాల మేరకు రిజిస్ట్రార్ ప్రొఫెసర్ యాదగిరి సోమవారం రవీందర్‌రెడ్డికి నియామక ఉత్తర్వులు అందజేశారు. రవీందర్‌రెడ్డి ప్రస్తుతం తెయూ ఎన్‌ఎస్‌ఎస్ కోఆర్డినేటర్‌గా కొనసాగుతున్నారు.
‘గిరిరాజ్’ వైస్ ప్రిన్సిపాల్ రంగరత్నానికి డాక్టరేట్
నిజామాబాద్‌అర్బన్: గిరిరాజ్ ప్రభుత్వ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ రంగరత్నానికి డాక్టరేట్ లభించింది. రసాయనశాస్త్రంలో ‘పాలిమర్ మాట్రిక్స్‌తో ఔషధాలను జతచేసి, వాటి జీవప్రక్రియలపై అధ్యయనం’ అనే అంశంపై ప్రొఫెసర్ ఎస్‌బీ పట్వారీ పర్యవేక్షణలో పరిశోధన చేశారు. నాందేడ్‌లోని ఎస్‌ఆర్‌టీఎం యూనివర్సిటీ నుంచి పీహెచ్‌డీ పట్టా అందుకున్నారు. డాక్టరేట్ అందుకున్న రంగరత్నాన్ని అధ్యాపక బృందం సోమవారం సన్మానించింది. కార్యక్రమంలో పరీక్షల నియంత్రణాధికారి భరత్‌రాజ్, కార్యాలయ ఉద్యోగులు, విద్యార్థులు పాల్గొన్నారు.

‘గిరిరాజ్’ వైస్ ప్రిన్సిపాల్ రంగరత్నానికి డాక్టరేట్

సోషల్ సైన్స్ డీన్‌గా ప్రొఫెసర్ రవీందర్‌రెడ్డి