వరదలే వరదలు
● దశాబ్దాలుగా కళకళలాడుతున్న
శ్రీరాంసాగర్ ప్రాజెక్టు
● 47 ఏళ్లుగా ప్రాజెక్టులోకి ఇన్‌ఫ్లో
● చరిత్రలో అత్యధికంగా 1983లో..
అతి తక్కువ 1987, 2015లో..
● రెండుసార్లు డెడ్ స్టోరేజీకన్నా
తక్కువ నీటిమట్టం
బాల్కొండ: శ్రీరాంసాగర్ ప్రాజెక్టు దశాబ్దాలుగా నీటితో కళకళలాడుతోంది. 47 ఏళ్ల చరిత్రలో కేవ లం రెండేళ్లు మాత్రమే స్వల్ప ఇన్‌ఫ్లో వచ్చింది. ప్రా జెక్టుకు 1983 నుంచి వరదలు ప్రారంభమయ్యా యి. 1978 నుంచి కాలువల ద్వారా నీటి విడుదల ప్రారంభించినప్పటికీ ఆ సమయంలో ప్రాజెక్ట్ ని ర్మాణం పూర్తి కాలేదు. గడిచిన 47 ఏళ్లలో 10 సంవత్సరాలు మాత్రమే స్వల్పంగా వరద నీరు వచ్చి చే రింది. 1987, 2015లో మాత్రమే ప్రాజెక్ట్ నీటి మ ట్టం డెడ్ స్టోరేజీ (5 టీఎంసీలు) కన్నా తక్కువ నీటి మట్టానికి పడిపోయింది. దశాబ్ద కాలంగా ప్రతి ఏడాది ప్రాజెక్ట్ నిండుకుండలా మారుతుండగా మిగులు జలాలను దిగువకు విడుదల చేస్తున్నారు.
బాల్కొండ: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లోకి ఎగువ నుంచి వరద మళ్లీ పోటెత్తింది. ఆదివారం సా యంత్రం 28 వేల క్యూసెక్కులుగా ఉన్న ఇన్‌ఫ్లో క్రమంగా 50 వేల క్యూసెక్కులకు పెరిగింది. ఆదివారం రాత్రి 7గంటలకు 8 గేట్లను ఎత్తి 12,500 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. అర్ధరాత్రి తరువాత 54 వేల క్యూసెక్కుల కు పెరగడంతో అవుట్‌ఫ్లోను 25వేల క్యూసెక్కు లకు పెంచారు. సోమవారం రోజంతా నిలకడగా కొనసాగిన ఇన్‌ఫ్లో సాయంత్రానికి 66,685 క్యూ సెక్కులకు పెరిగింది. దీంతో 12 వరద గేట్ల ద్వా రా 37,500 క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి వదులుతున్నారు. ఎగువ నుంచి వరద మరింత పెరిగే అవకాశం ఉందని ప్రాజెక్ట్ అధికారులు తెలిపారు.
కాలువల ద్వారా..
వరద కాలువ ద్వారా 19 వేల క్యూసెక్కులు, కా కతీయ కాలువ ద్వారా 5500, ఎస్కేప్ గేట్ల ద్వారా 2500, సరస్వతి కాలువ ద్వారా 800, లక్ష్మికాలువ ద్వారా 200, గుత్ప లిఫ్ట్‌కు 270 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. మిషన్ భగీరథ అవసరాలకు 231 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తుండగా, ఆవిరి రూపంలో 684 క్యూసెక్కుల నీరు పోతోంది. ప్రాజెక్ట్‌పూర్తి స్థాయి నీటి మట్టం 1091(80.5 టీఎంసీలు) అడుగులు కాగా సోమవారం సాయంత్రానికి అంతే స్థాయి నీటి మట్టంతో ప్రాజెక్ట్ నిండుకుండలా ఉంది.
మళ్లీ పోటెత్తిన వరద..
12 వరద గేట్ల ద్వారా 37,500 క్యూసెక్కుల నీటి విడుదల
ఎగువ నుంచి 66,685
క్యూసెక్కుల ఇన్‌ఫ్లో