
ప్రజావాణికి 114 ఫిర్యాదులు
నిజామాబాద్‌అర్బన్: ప్రజావాణికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో 114 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్‌తోపాటు అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, ట్రెయినీ కలెక్టర్ కరోలిన్ చింగ్తియాన్ మావీ, డీఆర్డీవో సాయాగౌడ్, నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్‌కుమార్, డీపీవో శ్రీనివాస్, ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వర్‌రెడ్డికి అర్జీలు అందజేశారు. ఫిర్యాదులను పెండింగ్‌లో పెట్ట కుండా ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ సమస్యలను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఖలీల్‌వాడి: జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావా ణి కార్యక్రమానికి 11 ఫిర్యాదులు వచ్చాయి. బాధితుల సమస్యలను విన్న సీపీ సాయిచైతన్య వాటిని చట్టప్రకారం పరిష్కరించాలని సంబంధిత అధికారులకు సూచించారు. ప్రజలు పోలీసుల సేవలను స్వచ్ఛందంగా వినియోగించుకోవాలని పేర్కొన్నారు. శాంతిభద్రతలను పరిరక్షిస్తూ ముందుకు సాగడమే లక్ష్యంగా జిల్లా పోలీస్ శాఖ పని చేస్తోందని సీపీ పేర్కొన్నారు.
నిజామాబాద్ నాగారం: జిల్లా కబడ్డీ అసో సియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 13న శని వారం ఉదయం 10 గంటలకు నగరంలోని క్రీడా మైదానంలో అండర్–16 బాలుర జట్ల ఎంపికలు జరుగుతాయని అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు లింగయ్య, గంగాధర్ రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపికలో పాల్గొనేవారు 16 సంవత్సరాల్లోపు వయస్సు, 55 కేజీల బరువు ఉండాలన్నారు. ఆధార్ కార్డుతోపాటు జనన ధ్రువీకరణ పత్రం తప్పనిసరిగా తీసుకురావాలన్నారు. ఎంపికై న క్రీడాకారులు జిల్లాలో జరగబోయే రాష్ట్రస్థాయి అంతర్ జిల్లాల కబడ్డీ చాంపియన్‌షిప్ పోటీల్లో పాల్గొంటారన్నారు.
నిజామాబాద్‌అర్బన్: ఈ నెల 12వ తేదీ వరకు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూ నివర్సిటీలో డిగ్రీ, పీజీ కోర్సులకు ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకోవాలని రీజినల్ కో ఆర్డినేటర్ రంజిత సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. డిగ్రీలో బీఎస్సీ, ఎంపీసీ, బీజెడ్‌సీ, పీజీలో ఎంకాం, ఎమ్మెస్సీ, ఎంబీఏ కో ర్సులు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. ఆసక్తిగల వారు దూర విద్యను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.