పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం | - | Sakshi
Sakshi News home page

పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

Sep 8 2025 5:00 AM | Updated on Sep 8 2025 5:00 AM

పూర్వ

పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

జక్రాన్‌పల్లి: మండలంలోని అర్గుల్‌ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో 2007–08 బ్యాచ్‌ పదో తరగతి విద్యార్థులు ఆదివారం ‘పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం’ నిర్వహించారు. మిత్రులంతా ఏళ్ల త ర్వాత కలుసుకోవడంతో ఆలింగనం చేసుకొని ఆత్మీయంగా పలకరించుకున్నారు. చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకుని ఆనందంగా గడిపారు. ఆనాటి ఉపాధ్యాయులను సత్కరించారు. అనంతరం సాంస్కృతిక కార్యకమ్రాలు, వింధులతో ఉత్సాహంగా గడిపారు.

భిక్కనూరు: మండలంలోని పెద్దమల్లారెడ్డి ప్రభుత్వ ఉన్నత పాఠశాల 1996–97 విద్యార్థులు ఆదివారం స్థానిక వీరభద్ర ఫంక్షన్‌హాల్‌లో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈసందర్భంగా విద్యార్థులంతా 28 ఏళ్ల తర్వాత కలుసుకోవడంతో భావోద్వేగానికి గురయ్యారు.ఒకరినొకరు ఆ ప్యాయంగా పలుకరించుకుంటూ యోగక్షేమాలు తెలుసుకున్నారు.అనంతరం తమకు చదువు చెప్పి న ఆనాటి ఉపాధ్యాయులను సత్కరించి వారి ఆశీ ర్వాదం పొందారు. వచ్చే ఏడాది కుటుంబీకులతో క లిసి సమ్మేళనం నిర్వహించాలని తీర్మానించుకున్నా రు. పాఠశాల అభివృద్ధికి సైతం కృషిచేస్తామన్నారు.

పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం 1
1/1

పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement