
ఘనంగా జెండాజాతర
ఊరేగింపుగా జెండాను పులాంగ్ వైపు తీసుకెళుతున్న భక్తులు
నిజామాబాద్ రూరల్ : నగరంలోని జెండా బాలాజీ ఆలయంలో 15 రోజులపాటు విశే ష పూజలందుకున్న జెండా ఆదివారం ఉద యం భక్తజన సందోహం మధ్య పులాంగ్‌కు తరలింది. భక్తుల దాండియా, కోలాటాలు, భాజాభజంత్రీల చప్పుళ్లతో ఆలయ అర్చకులు ఉత్సవ విగ్రహాల ఊరేగింపు నిర్వ హించారు. ఈ సందర్భంగా జెండాను మో సేందుకు భక్తులు పోటీ పడ్డారు. ఆనవాయి తీ ప్రకారం వారం రోజులపాటు పులాంగ్ వద్ద ప్రతిష్టించిన జెండా పూజలందుకోను న్నది. అనంతరం తిరుపతికి తరలివెళ్తుంది. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ ప్రమోద్, కా ర్యనిర్వహణాధికారి వేణు పాల్గొన్నారు.
రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బొమ్మ మహేశ్ కుమార్‌గౌడ్ జెండా బాలాజీ ఆలయంలో ఆదివారం ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయనకు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం మహేశ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో నడుస్తోందన్నారు. ఆయన వెంట పీసీసీ డెలిగేట్ బాడ్సి శేఖర్ గౌడ్ తదితరులు ఉన్నారు.
భక్తుల కోలాహలం మధ్య
పులాంగ్‌కు తరలింపు
జెండాను మోసేందుకు పోటీపడ్డ
భక్తజనం

ఘనంగా జెండాజాతర

ఘనంగా జెండాజాతర